ETV Bharat / bharat

ప్రభుత్వ ఉద్యోగాలకు ఒకే పరీక్ష- లాభాలు ఇవే...

author img

By

Published : Aug 19, 2020, 7:04 PM IST

కేంద్రం పరిధిలోని అన్ని ఉద్యోగాల నియామకానికి సంబంధించి ఒకే పరీక్ష నిర్వహించే విధంగా కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. ఉద్యోగ నియామకాల కోసం ఎన్‌ఆర్‌ఏ ఏర్పాటు చేయనుంది. మరి దీని ద్వారా అభ్యర్థులకు కలిగే ప్రయోజనాలేంటి? ఈ విధానం ఎలా ఉంటుంది? రిజర్వేషన్ల సంగతేంటి? ఇలాంటి పలు ప్రశ్నలకు సమాధానం తెలుసుకుందాం.

Cabinet clears National Recruitment Agency to conduct common test for govt jobs
ప్రభుత్వ ఉద్యోగాలకు ఒకే పరీక్ష- లాభాలు ఇవే!

రాబోయే రోజుల్లో కేంద్రం పరిధిలోని అన్ని ఉద్యోగాల నియామకానికి సంబంధించి ఒకే పరీక్ష నిర్వహించనున్నట్లు కేంద్ర మంత్రి ప్రకాశ్‌ జావడేకర్ వెల్లడించారు. ఇందుకోసం నూతనంగా జాతీయ నియామక సంస్థ (ఎన్‌ఆర్‌ఏ)ను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. బుధవారం ప్రధాని మోదీ అధ్యక్షతన జరిగిన కేబినెట్ భేటీలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. అయితే దీని వల్ల లాభాలేంటి? నిరుద్యోగులకు ఏ విధంగా మేలు జరుగుతుందనే విషయాలు ఇప్పుడు చూద్దాం.

ఎన్​ఆర్​ఏ ఏంటి?

  • కేంద్ర ప్రభుత్వం పరిధిలోని నాన్ గెజిటెడ్‌ ఉద్యోగాలు, ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో ఉద్యోగాల కోసం ఉమ్మడి పరీక్షను నిర్వహించేందుకు ఏర్పాటు చేసిన సంస్థ.
  • ప్రభుత్వంలో కార్యదర్శి హోదాలో పనిచేసే అధికారి దీనికి ఛైర్మన్​గా వ్యవహరిస్తారు.
  • దిల్లీలో ఎన్​ఆర్​ఏ ప్రధానకార్యాలయం ఏర్పాటు చేస్తారు.
  • 117 జిల్లాల్లో పరీక్ష నిర్వహణ కోసం అవసరమయ్యే మౌలిక సదుపాయాలు అభివృద్ధి చేస్తారు.
  • ఇందుకోసం ప్రభుత్వం రూ. 1,517.57 కోట్లు మంజూరు చేసింది.

ఏం చేస్తుంది?

  • ఒకే అర్హత అవసరమనున్న పలు రకాల ఉద్యోగాలకు ఉమ్మడి పరీక్ష నిర్వహిస్తుంది.
  • ఉమ్మడి అర్హత పరీక్ష నిర్వహించి గ్రూప్ బీ, గ్రూప్ సీ(నాన్ టెక్నికల్) పోస్టులకు అభ్యర్థులను షార్ట్​ లిస్ట్ చేస్తుంది.

ఉమ్మడి పరీక్ష అంటే?

ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగ నియామకాలకు సంబంధించి 20 సంస్థలు పనిచేస్తున్నాయి. ఇందులో మూడు సంస్థలు మాత్రమే ఉద్యోగ నియామక పరీక్షలు నిర్వహిస్తున్నాయి. ప్రస్తుత నిర్ణయంతో అన్ని సంస్థలకు కలిపి ఒకటే పరీక్ష కామన్ ఎలిజిబిలిటీ టెస్ట్ (సీఈటీ) నిర్వహించనున్నారు.

పరీక్ష రాస్తే ప్రయోజనం?

  • వివిధ ఏజెన్సీలు నిర్వహించే పరీక్షలన్నింటికీ వేర్వేరుగా ఫీజులు చెల్లించాల్సిన అవసరం ఉండదు.
  • పరీక్షలకు హాజరయ్యేందుకు ప్రతిసారి సుదూర ప్రాంతాలకు ప్రయాణం చేయనక్కర్లేదు.
  • ఈ పరీక్షలో ఉత్తీర్ణులైన వారు మూడేళ్ల పాటు వివిధ ప్రభుత్వ రంగ సంస్థలకు చెందిన ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు.

నిర్వహణ ఎలా?

సీఈటీని ఆన్‌లైన్‌లో నిర్వహిస్తారు. స్టాఫ్ సెలక్షన్‌ కమిషన్ (ఎస్‌ఎస్‌సీ), రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు (ఆర్ఆర్‌బీ), ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ సర్వీస్‌ పర్సనల్ (ఐబీపీఎస్) కోసం సీఈటీ తొలి దశ పరీక్షలు ఉంటాయి.

ఎవరెవరు, ఎక్కడెక్కడ రాయొచ్చు?

సీఈటీని డిగ్రీ, పన్నెండు, పది తరగతులు ఉత్తీర్ణులైన వారు దేశంలో ఎక్కడి నుంచైనా రాయవచ్చు. దేశవ్యాప్తంగా 117 జిల్లాలో ఈ పరీక్ష నిర్వహించేందుకు కేంద్రం ఏర్పాట్లు చేస్తోంది.

దీని వల్ల లాభమేంటి?

నియామకాల్లో పారదర్శకత పెరుగుతుంది. ప్రభుత్వానికి, ఉద్యోగార్థులకు సమయం ఆదా అవుతుంది.

మరి రిజర్వేషన్ల సంగతి?

ప్రస్తుత విధివిధానాల ప్రకారమే రిజర్వేషన్లు అమలవుతాయి.

ఎన్​ఆర్​ఏలో ఎవరెవరు ఉంటారు?

రైల్వే శాఖ, ఆర్థిక శాఖ, స్టాఫ్ సెలక్షన్ కమిషన్, రైల్వే రిక్రూట్​మెంట్ బోర్డు, ఐబీపీఎస్​ ప్రతినిధులు ఇందులో భాగస్వాములవుతారు.

మోదీ ఏమన్నారు?

ఉద్యోగ నియామకాల్లో పారదర్శకతకు పెద్ద పీట వేస్తూ తీసుకొచ్చిన ఎన్‌ఆర్‌ఏ యువ ఉద్యోగార్థులకు వరంగా మారనుందని ప్రధాని మోదీ అన్నారు.

"కోట్లాది మంది యువతకు జాతీయ నియామక సంస్థ వరంగా మారుతుంది. ఉమ్మడి అర్హత పరీక్ష ద్వారా అనేక ప్రవేశ పరీక్షలు తొలగిపోయి.. విలువైన సమయం, వనరులు ఆదా అవుతాయి. పారదర్శకతకు కూడా ఇది పెద్దపీట వేస్తుంది."

-నరేంద్ర మోదీ, ప్రధానమంత్రి

తొలివిడతగా దేశవ్యాప్తంగా వెయ్యి కేంద్రాల్లో పరీక్ష నిర్వహించేందుకు ప్రణాళికలు రచిస్తున్నట్లు కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ వెల్లడించారు. ప్రతి జిల్లాలో కనీసం ఒక పరీక్ష కేంద్రం ఉంటుందని తెలిపారు. ఏ అభ్యర్థి దూర ప్రయాణాలు చేసే అవసరం ఉండదని పేర్కొన్నారు.

ఇదీ చదవండి- కేంద్ర ప్రభుత్వ ఉద్యోగ నియామకాలకు ఇక ఒకే పరీక్ష!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.