ఉద్యోగులకు ప్రభుత్వం తీపి కబురు అందించింది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు కరవు భత్యం (డీఏ) 4 శాతం పెంచుతూ కేంద్ర కేబినెట్ నిర్ణయం తీసుకుంది. ఈ పెంపుతో డీఏ శాతం 21కి చేరనుంది.
ఈ నిర్ణయం ద్వారా 48 లక్షల మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, 65 లక్షల మంది పింఛనుదారులకు లబ్ధి చేకూరనుంది. డీఏ పెంపు ద్వారా రూ.14,595 కోట్ల మేర ప్రభుత్వ ఖజానాపై అదనపు భారం పడనుందని కేంద్ర మంత్రి ప్రకాశ్ జావడేకర్ తెలిపారు.