ETV Bharat / bharat

'నేను బతికున్నంత వరకు బంగాల్​లో సీఏఏ అమలు కాదు'

author img

By

Published : Dec 27, 2019, 7:20 PM IST

దేశవ్యాప్తంగా పౌరసత్వ చట్టానికి వ్యతిరేకంగా నిరసనలు వెల్లువెత్తుతున్న వేళ.. బంగాల్​ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కీలక వ్యాఖ్యలు చేశారు. తాను జీవించి ఉన్నంత వరకు బంగాల్​లో​ సీఏఏను అమలు కానివ్వనని తేల్చిచెప్పారు.

CAA will not be implemented in Bengal as long as I am alive:
'నేను బతికున్నంత వరకు బంగాల్​లో సీఏఏ అమలు కాదు'

పౌరసత్వ చట్టానికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా నిరసనలు హోరెత్తుతున్నాయి. బంగాల్​లో ముఖ్యమంత్రి మమతా బెనర్జీ స్వయంగా నిరసనల్లో పాల్గొంటున్నారు. అయితే సీఏఏపై తాజాగా మమతా బెనర్జీ కీలక వ్యాఖ్యలు చేశారు. తాను జీవించి ఉన్నంతవరకు బంగాల్​​లో పౌరసత్వ చట్టాన్ని అమలు చేయనివ్వబోనని ఉద్ఘాంటించారు.

"నేను జీవించి ఉన్నంత కాలం బంగాల్​లో సీఏఏను అమలు చేయనివ్వను. ఎవ్వరూ ఈ దేశాన్ని, రాష్ట్రాన్ని వదిలి వెళ్లాల్సిన అవసరం లేదు. బంగాల్​లో ఎటువంటి నిర్బంధ కేంద్రం ఉండదు. కిరాతకమైన ఈ చట్టానికి వ్యతిరేకంగా విద్యార్థులు ఎందుకు నిరసనలు చేయకూడదు? ఆందోళనలు చేపట్టిన విద్యార్ధులపై కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. వారిని విశ్వవిద్యాలయాల నుంచి బహిష్కరిస్తోంది."

మమతా బెనర్జీ, బంగాల్​​​ ముఖ్యమంత్రి

ప్రజల హక్కులను ఎవ్వరూ కాలరాయలేరని తృణమూల్​ కాంగ్రెస్​ అధినేత్రి అన్నారు. దేశవ్యాప్తంగా సీఏఏకు వ్యతిరేకంగా వెల్లువెత్తుతున్న నిరసనలకు విద్యార్థులు మద్దతు ఇస్తున్నారని మమతా పేర్కొన్నారు. 18 ఏళ్లకే ప్రభుత్వాన్ని ఎన్నుకునే హక్కు యువతకు ఉన్నప్పుడు.. నిరసనలు చేసే హక్కు వారికి ఎందుకు లేదని దీదీ ప్రశ్నించారు.

ఇదీ చూడండి: గిరిజన పండుగలో ప్రత్యేక ఆకర్షణగా 'రాహుల్ నృత్యం'

Amaravati (Andhra Pradesh), Dec 27 (ANI): Chief Minister of Andhra Pradesh, YS Jagan Mohan Reddy chaired cabinet meeting in Andhra Pradesh's Amaravati on Dec 27. The meeting was attended by cabinet ministers. Several key issues along with the report presented by 'GN Rao Committee on Development and Capital' were discussed in the meeting.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.