ETV Bharat / bharat

పౌరసత్వంపై కాంగ్రెస్​కు ప్రధాని మోదీ సవాల్ - CAA stir: Modi dares Cong to say it's ready to accord Indian citizenship to all Pakistanis

​ధైర్యముంటే పాకిస్థానీలందరికీ భారత పౌరసత్వం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నట్టు కాంగ్రెస్​ బహిరంగంగా ఒప్పుకోవాలని సవాలు చేశారు ప్రధాని మోది. ఝార్ఖండ్ ఎన్నికల ప్రచార ర్యాలీ వేదికగా పౌరసత్వ సవరణ చట్టాన్ని మోదీ ప్రశంసించారు. సవరణతో భారతీయులకు ఎలాంటి ఇబ్బందులు ఉండవని స్పష్టం చేశారు. ఈ అంశంపై కాంగ్రెస్​ అసత్యాలు ప్రచారం చేస్తోందని మండిపడ్డారు.

CAA stir: Modi dares Cong to say it's ready to accord Indian   citizenship to all Pakistanis
పౌరసత్వంపై కాంగ్రెస్​కు ప్రధాని మోదీ సవాల్
author img

By

Published : Dec 17, 2019, 5:11 PM IST

Updated : Dec 17, 2019, 6:45 PM IST

పౌరసత్వంపై కాంగ్రెస్​కు ప్రధాని మోదీ సవాల్

పౌరసత్వ చట్ట సవరణపై కాంగ్రెస్ అసత్యాలు ప్రచారం చేస్తూ.. దేశంలోని ముస్లింలను భయాందోళనకు గురి చేస్తోందని ఆరోపించారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. విపక్షం.. ప్రజలను హింసాత్మక నిరసనలు చేసేలా రెచ్చగొడుతోందని మండిపడ్డారు.

ఝార్ఖండ్​లోని భోగ్నాదిహ్​లో ఎన్నికల ప్రచారం నిర్వహించిన ప్రధాని.. పౌరసత్వ చట్ట ​సవరణ వల్ల భారత పౌరులకు ఎలాంటి ఇబ్బంది కలగదని స్పష్టం చేశారు. ధైర్యముంటే.. పాకిస్థానీలకు భారత పౌరసత్వం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్న విషయాన్ని కాంగ్రెస్​ బహిరంగంగా ఒప్పుకోవాలన్నారు.

"ఇప్పుడు పౌరసత్వ సవరణ చట్టానికి సంబంధించి... మరోసారి పచ్చి అబద్ధాలు చెబుతున్నారు. వీరు( కాంగ్రెస్​) దేశంలో అసత్యం, భ్రమ, అహింసలను వ్యాపింపజేస్తున్నారు. ఈ పౌరసత్వ సవరణ చట్టం వల్ల భారత దేశంలో ఉన్న ఏ ఒక్క భారతీయుడిపైనా ప్రభావం పడదు. కాంగ్రెస్​, తన మిత్ర పక్షాలు కలిసి అసత్యాలు ప్రచారం చేస్తున్నాయి. మేము రూపొందించిన చట్టం మన పక్క దేశాలవారికి సంబంధించింది. మూడు దేశాల్లో మతపరమైన హింసల వల్ల భారత్​కు వచ్చే వారి కోసమే ఈ చట్టం తయారైంది. ఎవరైతే ఏళ్లుగా భారత్​లో నివసిస్తూ.. తిరిగి వారి దేశానికి వెళ్లలేక దయనీయ స్థితిలో ఉన్నారో.. వారి కోసం మాత్రమే ఈ చట్టం. అసలు ఈ సవరణ ముస్లింల హక్కులకు ఎలా భంగం కలిగిస్తుందో నేను తెలుసుకోవాలనుకుంటున్నా. కాంగ్రెస్​కు దాని మిత్రపక్షాలకు దమ్ము, ధైర్యం ఉంటే.. ప్రతి పాకిస్థానీ పౌరుడికి భారత పౌరసత్వం ఇవ్వడానికి వారు సిద్ధంగా ఉన్నారని బహిరంగంగా ఒప్పుకోవాలి."

-ప్రధాని మోదీ.

ఇదీ చదవండి:బంగాల్​లో మమత మరో ర్యాలీ- గువాహటిలో కర్ఫ్యూ ఎత్తివేత

New Delhi, Dec 17 (ANI): While speaking to media in the national capital on December 17, the Additional DCP (South East) of Delhi Police Kumar Gyanesh spoke on Jamia Millia Islamia incident. He said, "I saw it myself and some protesters were carrying wet blankets and putting them on tear gas shells to minimize their impact." "It did not seem to be spontaneous but well planned. Investigation is underway in this matter," he added. "Petrol bombs were also hurled at us by the protesters. These things do not happen on the spot, it shows that it was a conspiracy," he further stated.

Last Updated : Dec 17, 2019, 6:45 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.