ETV Bharat / bharat

పౌర ఆగ్రహం: దేశవ్యాప్తంగా కొనసాగుతున్న నిరసనలు-లైవ్ - caa protests across country

CAA protets across country
దేశ వ్యాప్తంగా పౌరసత్వ చట్ట ఆగ్రహ జ్వాలలు
author img

By

Published : Dec 21, 2019, 2:02 PM IST

Updated : Dec 21, 2019, 11:44 PM IST

21:42 December 21

బంగాల్​లో నిరసనల హోరు

పౌరసత్వ చట్ట సవరణ సహ జామియా ఘటనకు వ్యతిరేకంగా పశ్చిమబంగాల్​లో భారీ సంఖ్యలో విద్యార్థులు నిరసన చేపట్టారు. జాదవ్​పుర్​ విశ్వవిద్యాలయం, కలకత్తా,  ప్రెసిడెన్సీ, ఆలియా వర్సిటీల విద్యార్థులు నిరసనలో పాల్గొన్నారు.

20:54 December 21

కేరళలో కాగడాల ర్యాలీ

పౌర చట్ట వ్యతిరేక నినాదాలతో కేరళ రాజధాని తిరువనంతపురం హోరెత్తింది. వామపక్ష పార్టీల యువతా విభాగాల ఆధ్వర్యంలో నగరంలో కాగడాల ర్యాలీ నిర్వహించారు.

20:54 December 21

జైపుర్​లో భద్రత కట్టుదిట్టం

జైపుర్​లో పౌర ఆందోళనల నేపథ్యంలో భద్రతను కట్టుదిట్టం చేశారు. ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు మెట్రో సేవలను నిలిపేయనున్నట్లు ప్రకటించారు  అధికారులు. అదే విధంగా ఉదయం నుంచి రాత్రి వరకు అంతర్జాల సేవలను బంద్ చేయనున్నట్లు వెల్లడించారు.

20:48 December 21

పౌరచట్టంపై కేరళ గవర్నర్ స్పందన

పౌరచట్టం విషయమై మహాత్మాగాంధీ, పండిట్ నెహ్రూ, నాటి కాంగ్రెస్​ అభీష్టం మేరకే కేంద్ర సర్కారు పనిచేసిందన్నారు కేరళ గవర్నర్ ఆరిఫ్ మహ్మద్ ఖాన్. 1985, 2003 సంవత్సరాల్లో పౌరచట్ట సవరణకు పునాది పడిందన్నారు. పొరుగుదేశాల నుంచి ఉద్యోగాలు చేసేందుకు వచ్చే ముస్లింలను ప్రభుత్వం అనుమతిస్తోందన్నారు. కానీ హింసకు గురయ్యారన్న కారణంతో కాదన్నారు.

19:51 December 21

  • Kerala Governor on exclusion of Muslims from #CitizenshipAmendmentAct: Pakistan was formed as Muslim nation, so will they persecute Muslims also there? We admit Muslims came from Pakistan & Bangladesh, but not because they were persecuted but in search of economic opportunities. https://t.co/nK7idA9jHe

    — ANI (@ANI) December 21, 2019 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

మృతుల కుటుంబాలకు దిల్లీ వక్ఫ్​ బోర్డు పరిహారం

దేశవ్యాప్తంగా పౌర నిరసనల్లో మృతిచెందినవారి కుటుంబాలకు రూ.5లక్షల పరిహారం ప్రకటించింది దిల్లీ వక్ఫ్ బోర్డు. ఈ ఖర్చును వక్ఫ్ బోర్డు భరిస్తుందని ఆప్ ఎమ్మెల్యే, దిల్లీ వక్ఫ్​ బోర్డు ఛైర్మన్​ అమనతుల్లా ఖాన్​ స్పష్టం చేశారు.

19:40 December 21

ఆజాద్​ బెయిల్​ పిటిషన్​ కొట్టివేత

భీమ్​ ఆర్మీ అధినేత చంద్రశేఖర్​ ఆజాద్​ బెయిల్​ పిటిషన్​ను దిల్లీ తీస్​ హజారి కోర్టు కొట్టివేసింది. 14 రోజుల జుడిషీయల్​ కస్టడీకి అనుమతిస్తూ పోలీసులకు ఆదేశాలిచ్చింది. తీస్​ హజారి కోర్టు నుంచి ఆజాద్​ను తిహార్ జైలుకు తరలించారు పోలీసులు.

19:10 December 21

తీస్​ హజారి కోర్టులో భీమ్​ ఆర్మీ ఆజాద్​ బెయిల్​ పిటిషన్​

భీమ్​ ఆర్మీ అధినేత చంద్రశేఖర్​ ఆజాద్​.. దిల్లీ తీస్​ హజారి కోర్టులో బెయిల్​ పిటిషన్​ దాఖలు చేశారు. ఆజాద్​కు 14 రోజుల జుడిషీయల్​ కస్టడీకి అనుమతించాలని పోలీసులు కోర్టును కోరారు.

దిల్లీ జామా మసీదు నుంచి జంతర్​ మంతర్​ వరకు శుక్రవారం ర్యాలీ నిర్వహించాలని ప్రయత్నించారు ఆజాద్​. భద్రత కారణాల దృష్ట్యా పోలీసులు అనుమతి ఇవ్వలేదు. నిరసనకారులు భారీగా తరలివచ్చిన నేపథ్యంలో ఆజాద్​ను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు.

19:01 December 21

  • Bhim Army Chief Chandrashekhar Azad who was arrested today has moved for bail at Delhi's Tis Hazari Court. Police has sought his 14-day judicial custody. Azad was earlier denied permission for a protest march from Jama Masjid to Jantar Mantar. (File pic) pic.twitter.com/4rc6lH6JAK

రాజ్​ఘాట్​ వద్ద రేపు కాంగ్రెస్ ధర్నా

  • పౌర చట్టానికి వ్యతిరేకంగా రేపు కాంగ్రెస్ ధర్నా
  • బాపూ స్మారకం రాజ్​ఘాట్​ వేదిక
  • మధ్నాహ్నం 2 నుంచి రాత్రి 8 గంటల వరకు నిరసన
  • రాహుల్​ గాంధీ హాజరకావాలని సోనియా ఆదేశం

18:50 December 21

హరిద్వార్​లో 144 సెక్షన్​ విధింపు

  • ఉత్తరాఖండ్​లోని హరిద్వార్​లో 144 సెక్షన్​ విధింపు
  • నలుగురి కన్నా ఎక్కువ మంది కలిసి ఉండటం నిషేధం
  • రేపు నిరసనలు జరగనున్న కారణంగా పోలీసుల నిర్ణయం

18:06 December 21

  • Uttarakhand: Section 144 (prohibits assembly of more than 4 people in an area) has been imposed in Haridwar in view of protests against #CitizenshipAmendmentAct tomorrow.

లఖ్​నవూలో టెలికాం సేవల రద్దు కొనసాగింపు

ఉత్తర్​ప్రదేశ్​ రాజధాని లఖ్​నవూలో టెలికాం సేవల నిలిపివేతను కొనసాగించాలని పోలీసులు నిర్ణయించారు. పౌర నిరసనల కొనసాగుతున్న నేపథ్యంలో సోమవారం వరకు పొడగించారు.

18:00 December 21

శీలంపుర్​ నిందితులకు న్యాయనిర్బంధం

దిల్లీలోని శీలంపుర్​ అల్లర్లలో అరెస్టయిన నిందితులకు 14 రోజుల జుడిషీయల్​ కస్టడీ విధించింది దిల్లీ కోర్టు.

దరియాగంజ్​ కేసులో 15మందికి తీస్ హజారి​ కోర్టు 2 రెండు రోజుల న్యాయనిర్బంధం విధించింది.

17:49 December 21

పౌరచట్టంపై భాజపా అవగాహన కార్యక్రమం

పౌరసత్వ సవరణ చట్టంపై ప్రజలకు అవగాహన కల్పించాలని భాజపా నిర్ణయించింది. ఇందుకోసం వచ్చే 10 రోజుల్లో 3 కోట్ల కుటుంబాలను కలిసి చట్టంలోని అంశాలను వివరించనుంది. 250 ప్రాంతాల్లో మీడియా సమావేశాలు ఏర్పాటు చేసి వివరిస్తామని కమలం నేత భూపేందర్ యాదవ్​ తెలిపారు.

17:43 December 21

  • Bhupender Yadav, BJP in Delhi: Our party has decided that in the coming 10 days we will launch a special campaign and contact over 3 crore families for Citizenship Amendment Act. We will hold press briefings in support of this Act at more than 250 places. pic.twitter.com/o8gHHIeMkv

కాన్పూర్​లో పోలీసులు, నిరసనకారుల ఘర్షణ

ఉత్తర్​ప్రదేశ్​ కాన్పూర్​లో పౌర చట్టం వ్యతిరేక నిరసనల్లో పోలీసులపైకి ఆందోళనకారులు రాళ్లు విసిరారు. పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు బాష్పవాయు గోళాలను ప్రయోగించారు పోలీసులు.

17:36 December 21

17:02 December 21

  • Praveen Kumar, IG(Law&Order): In protest against #CitizenshipAmendmentAct since Dec 10 in state, 705 people arrested&around 4500 people released after preventive arrest.15 casualties have happened,&263 police personnel were injured of which 57 personnel received fire arm injuries pic.twitter.com/L4d7GKDdHG

    — ANI UP (@ANINewsUP) December 21, 2019 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

యూపీలో 15 మంది మృతి: ఐజీ

ఉత్తర్​ప్రదేశ్​లో పౌరచట్టానికి వ్యతిరేకంగా నిరసనలు ప్రారంభమయినప్పటి నుంచి జరిగిన నష్టాన్ని అంచనా వేసి ప్రకటించారు శాంతి భద్రతల శాఖ ఐజీ ప్రవీన్​ కుమార్​.

  • డిసెంబర్​ 10 నుంచి రాష్ట్రంలో 705 మంది అరెస్టయ్యారు: ఐజీ
  • 4,500 మందిని ముందస్తు అరెస్టులు చేసి విడిచిపెట్టాం: ఐజీ
  • ఇప్పటి వరకు 15 మంది మరణించారు: ఐజీ
  • 263 మంది పోలీసులు గాయపడ్డారు: ఐజీ

16:53 December 21

దిల్లీలో దరియాణ్​​గంజ్​లో జరిగిన ఘర్షణలో అదుపులోకి తీసుకున్న నిందితులను ఈ రోజు తీస్​​ హజారి కోర్టులో ప్రవేశపెట్టారు పోలీసులు.

16:50 December 21

గువహటిలో మహిళల ఆందోళన

పౌరసత్వ చట్టానికి వ్యతిరేకంగా అసోం మహిళలు ఉద్యమించారు. గువహటిలోని లతాశిల్​ మైదానంలో మహిళలంతా బైఠాయించి నిరసన తెలిపారు.

16:48 December 21

ఉత్తరాఖండ్​లో నిరసనలు..

  • ఉత్తరాఖండ్​ హల్​ద్వనిలో పౌర చట్టానికి వ్యతిరేకంగా నిరసనలు.
  • అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పటిష్ఠ భద్రత ఏర్పాటు.
  • భారీగా మోహరించిన కేంద్ర బలగాలు

16:04 December 21

యూపీలో రాళ్లదాడి...

ఉత్తర్​ప్రదేశ్​ రాంపుర్​లో పౌరసత్వ చట్టంపై చేపట్టిన నిరసనలు హింసాత్మకంగా మారాయి. నిరసనకారులు పోలీసులపై రాళ్లు రువ్వారు. ఆందోళనకారులను చెదరగొట్టేందుకు పోలీసులు బాష్పవాయువు గోళాలను ప్రయోగించారు. 

15:06 December 21

జల ఫిరంగుల ప్రయోగం..

కేరళ కోజికోజ్​లో పౌరసత్వ చట్ట వ్యతిరేక నిరసనలు చేస్తున్న కాంగ్రెస్​ కార్యకర్తలను అదుపుచేసేందుకు పోలీసులు జలఫిరంగులు ప్రయోగించారు. 

14:40 December 21

చిన్నపిల్లలు కూడా...

బిహార్​లో ఆర్జేడీ పిలుపునిచ్చిన బంద్​లో భాగంగా పట్నాలో భారీ ర్యాలీ చేపట్టారు పార్టీ కార్యకర్తలు. చిన్నపిల్లలు కూడా ఈ ఆందోళనల్లో పాల్గొన్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. 

14:29 December 21

చెన్నైలోనూ ఆందోళనలు...

తమిళనాడు ఎంజీఆర్​ చెన్నై సెంట్రల్​ రైల్వే స్టేషన్​ ఎదుట.. పౌరసత్వ చట్టానికి వ్యతిరేకంగా ఆందోళనలు మిన్నంటాయి. నిరసనకారులు.. బారికేడ్లను తొలగించి విధ్వంస పరిస్థితులకు కారణమయ్యారు. 

14:27 December 21

మరోసారి జామియా ముందు నిరసన...

  • పౌరసత్వ సవరణ చట్టానికి నిరసనగా జామియాలో మరోసారి  నిరసన ప్రదర్శన
  • వర్సిటీ ప్రధాన ద్వారం వద్ద భారీ నిరసన ప్రదర్శన చేస్తున్న విద్యార్థులు, స్థానికులు
  • పౌరసత్వ సవరణ చట్టాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్

14:02 December 21

బిహార్​లో ఆటోలపై విరుచుకుపడ్డ ఆర్జేడీ కార్యకర్తలు

'పౌర' చట్టానికి వ్యతిరేకంగా బిహార్‌లో ఆర్జేడీ పార్టీ నేడు 'బంద్‌' కు పిలుపునిచ్చింది. ఈ నేపథ్యంలో ఆర్జేడీ కార్యకర్తలు భగల్‌పుర్‌ ప్రాంతంలో రోడ్లపై నడిచే ఆటోలపై కర్రలతో దాడి చేశారు. ఈ విధ్వంసంలో పలు వాహనాల అద్దాలు ధ్వంసమయ్యాయి. పౌరసత్వ సవరణ చట్టం, ఎన్​ఆర్​సీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

14:00 December 21

దిల్లీ దరియాగంజ్​ 'పౌర'అల్లర్లపై చర్యలు.. 15 మంది అరెస్ట్​

పౌర చట్టానికి వ్యతిరేకంగా దిల్లీ దరియాగంజ్​లో జరిగిన అల్లర్లకు సంబంధించి తాజాగా 15 మందిని అరెస్ట్ చేశారు పోలీసులు. నిన్న 40 మందిని అదుపులోకి తీసుకోగా..అందులో 8 మంది మైనర్లను విడుదల చేసినట్లు స్పష్టం చేశారు. అరెస్ట్​ చేసిన వారికి న్యాయ సహాయం అందించాలని.. వారిని న్యాయవాదులు కలిసేందుకు అనుమతించాలని ఆదేశించింది దిల్లీ కోర్టు.

13:59 December 21

యూపీ 'పౌర' అల్లర్లలో 11కి చేరిన మృతులు

పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా శుక్రవారం ఉత్తర్‌ప్రదేశ్‌లో జరిగిన హింసాత్మక ఘటనల్లో మృతి చెందిన వారి సంఖ్య 11కి చేరింది. మేరఠ్​​ జిల్లాలో జరిగిన అల్లర్లలో నలుగురు మృతి చెందారు. వారణాసిలో పోలీసులు, ఆందోళనకారుల ఘర్షణల నేపథ్యంలో జరిగిన తొక్కిసలాటలో ఎనిమిదేళ్ల బాలుడు ప్రాణాలు కోల్పోయాడు.

ప్రార్థనల అనంతరం చెలరేగిన హింస..

గోరఖ్‌పూర్‌, సంభాల్‌, భదోహి, బహ్రయిచ్‌, బులంద్‌శహర్‌, ఫిరోజాబాద్‌ సహా పలు ప్రాంతాల్లో శుక్రవారం ప్రార్థనల అనంతరం నిరసనకారులు రెచ్చిపోయారు. పోలీసులపై రాళ్లు రువ్వారు. వాహనాలకు నిప్పంటించారు. నిరసనలు హింసాత్మకంగా మారడంతో పోలీసులు బాష్పవాయు గోళాలు ప్రయోగించారు. రబ్బరు తూటాలతో కాల్పులు జరిపారు. బిజ్నోర్‌, మేరఠ్‌, సంభాల్‌, ఫిరోజాబాద్‌, కాన్పూర్‌లో ఆరుగురు మరణించారు. ఆందోళనకారుల దాడిలో 50 మందికిపైగా పోలీసులు తీవ్రంగా గాయపడ్డారు. ఆరుగురు పోలీసులకు తూటాలు తగిలాయి. ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు అధికారులు తెలిపారు.

13:34 December 21

దేశ వ్యాప్తంగా పౌరసత్వ చట్ట ఆగ్రహ జ్వాలలు

పౌరసత్వ చట్టంపై ఆగ్రహ జ్వాలలు ఇవాళా దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో కొనసాగుతున్నాయి. నేడు బిహార్  బంద్​కు పిలుపునిచ్చింది రాష్ట్రీయ జనతా దళ్(ఆర్​జేడీ) పార్టీ. బంద్​ను విజయవంతం చేసేందుకు పార్టీ కార్యకర్తలు ఉదయం నుంచే రోడ్లపైకి వచ్చారు. దర్భంగాలోని రహదారిపై టైర్లకు నిప్పంటించి అర్ధనగ్న ప్రదర్శన చేపట్టారు. బిహార్​ సీఎం నితీశ్​ కుమార్, కేంద్రానికి వ్యతిరేకంగా నిరసనకారులు నినాదాలు చేశారు. దర్భంగాలోని రైల్వే స్టేషన్​లో రైళ్ల రాకపోకలను నిలువరించారు. పౌరచట్టానికి వ్యతిరేకంగా ఆర్జేడీ పిలుపునిచ్చిన బంద్​కు మద్దతు తెలపాలని ప్రజలను కోరారు ఆ పార్టీనేత, బిహార్ మాజీ ఉపముఖ్యమంత్రి తేజస్వీ యాదవ్​.

********************
Thank you for using CCTV+ content.Please contact Ms. Haley HE at service@cctvplus.com or call +86 10 63960094 for any further enquiries about CCTV+ content.

Copyright 2013 CCTV. All rights reserved.
Last Updated : Dec 21, 2019, 11:44 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.