పౌరసత్వ చట్టానికి వ్యతిరేకంగా జరిగిన నిరనసలపై సుప్రీం కోర్టు విచారణ చేపట్టింది. ఈ వ్యవహారంపై సంబంధిత హైకోర్టులను ఆశ్రయించాలని పిటిషనర్లకు సూచించింది.
"నిజాలు తెలుసుకోవడానికి మేము సమయాన్ని వెచ్చించేందుకు సిద్ధంగా లేము. మీరు ముందుగా కింద కోర్టులకు వెళ్లాల్సింది. అయినా నిరసనల సమయంలో బస్సులు ఎలా తగలబడ్డాయి?"
- సుప్రీం ధర్మాసనం