కర్ణాటక ఉడిపిలో అనూహ్య ప్రమాదం చోటుచేసుకుంది. బైందోరు సమీపంలోని మారవంతె గ్రామానికి చెందిన రోహిత్ ఖార్వీ అకస్మాత్తుగా బోరుబావిలోకి పడిపోయాడు. భూమి కుంగిపోవడం వల్లే ఆ వ్యక్తి పడిపోయాడని అధికారులు తెలిపారు.
సాధారణంగా బోరుబావి ఒకటి లేదా రెండు అడుగుల వెడల్పు ఉంటుంది. గ్రామంలో తవ్విన ఓ బోరు బావి పక్కన నిల్చున్నాడు రోహిత్.. అంతే, ఒక్కసారిగా అతడు నిల్చున్న ప్రదేశం 15 అడుగుల లోతుకు కుంగిపోయింది. క్షణాల్లో గుంత ఏర్పడి అందులో చిక్కుకుపోయాడు.
ప్రస్తుతం రోహిత్‌ను బయటకు తీసేందుకు అధికారులు, సిబ్బంది తీవ్రంగా శ్రమిస్తున్నారు.
ఇదీ చదవండి:స్ఫూర్తి: అతడు వీరప్పన్ దోస్త్.. ఆమె ఓ దోషి.. అయినా!