ఉభయ సభల వాయిదా..
దిల్లీ అల్లర్లపై పార్లమెంటు ఉభయసభల్లో దుమారం చెలరేగింది. రెండూ రేపటికి వాయిదా పడ్డాయి. 3 గంటలకు తిరిగి ప్రారంభమైన రాజ్యసభలో కార్యకలాపాలు యథావిధిగా సాగే అవకాశం లేనందున రేపటికి వాయిదా వేశారు.
15:17 March 03

లోక్‌సభ వాయిదా
మధ్యాహ్నం రెండు గంటలకు తిరిగి ప్రారంభమైన ఉభయ సభల్లో దిల్లీ అల్లర్లపై చర్చకు విపక్షాలు పట్టుబట్టాయి. రెండు సభల్లో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో లోక్‌సభను స్పీకర్ రేపటికి వాయిదా వేశారు. రాజ్యసభ మధ్యాహ్నం 3గంటల వరకు వాయిదా పడింది.
12:16 March 03
లోక్‌సభ వాయిదా..
12 గంటలకు పునః ప్రారంభమైన అనంతరం కూడా లోక్‌సభలో గందరగోళం కొనసాగింది. ఘర్షణలపై చర్చించాలని నినాదాలు చేశారు విపక్షసభ్యులు. ఈ నేపథ్యంలో ప్రజా సమస్యలపై చర్చించాలని ప్యానెల్ స్పీకర్ కిరీట్ ప్రేమ్‌జీభాయ్ సోలంకి విపక్ష సభ్యులకు విజ్ఞప్తి చేశారు. అయితే విపక్ష సభ్యుల వైఖరితో సభ సజావుగా సాగే పరిస్థితులు లేని కారణంగా రెండు గంటలకు వాయిదా వేశారు.
11:44 March 03
దిల్లీ ఘర్షణలపై పార్లమెంట్ ఉభయసభలు దద్దరిల్లాయి. విపక్షసభ్యులు సీఏఏ అల్లర్లపై కాంగ్రస్, డీఎంకే సహా ఇతర విపక్ష పార్టీలు చర్చకు పట్టుబట్టిన నేపథ్యంలో లోక్‌సభలో గందరగోళం నెలకొంది. ఘర్షణలపై చర్చకు జీరో అవర్‌లో అవకాశం కల్పిస్తామని.. ముందస్తు ప్రణాళిక మేరకు ప్రశ్నోత్తరాల సమయాన్ని జరగనివ్వాలని సభ్యులకు స్పీకర్ ఓం బిర్లా విజ్ఞప్తి చేశారు. అయితే సభ్యుల నినాదాలతో గందరగోళం నెలకొన్న నేపథ్యంలో 12 గంటలకు వాయిదా వేశారు.
రెండు గంటలకు రాజ్యసభ..
రాజ్యసభలోనూ దిల్లీ అల్లర్లపై గందరగోళం తలెత్తింది. సభ ప్రారంభం కాగానే దిల్లీ అల్లర్లపై చర్చించాలని కోరారు విపక్ష సభ్యులు. అయితే ఛైర్మన్ వెంకయ్యనాయుుడు అందుకు అంగీకరించలేదు. ఈ నేపథ్యంలో ఘర్షణలపై చర్చకు విపక్ష సభ్యులు పట్టుబట్టిన కారణంగా సభను రెండు గంటలకు వాయిదా వేశారు.
11:15 March 03
'అల్లర్ల'పై ఆగని దుమారం.. ఉభయసభలు రేపటికి వాయిదా
దిల్లీ అల్లర్ల అంశం పార్లమెంటులో ప్రకంపనలు సృష్టిస్తోంది. దిల్లీ అల్లర్ల ఘటనపై చర్చించాలని విపక్షాలు పట్టుబడుతున్నాయి. ఈ నేపథ్యంలో పార్లమెంటు ఉభయసభలు వాయిదా పడ్డాయి. రాజ్యసభ మధ్యాహ్నం 2 గంటలకు, లోక్‌సభ 12 గంటలకు వాయిదా పడింది.