ETV Bharat / bharat

డేవిడ్​ ఎటెన్​బరోకు ఇందిరా శాంతి బహుమతి ప్రదానం - ఇందిరాగాంధీ శాంతి బహుమతి

2019 ఏడాదికి గానూ ఇందిరాగాంధీ శాంతి బహుమతిని.. బ్రిటిష్​ ప్రసారకుడు డేవిడ్​ ఎటెన్​బరోకు ప్రదానం చేశారు. వీడియోకాన్ఫరెన్స్​ ద్వారా ఆయనకు ఈ పురస్కారం అందించారు మాజీ ప్రధాని మన్మోహన్​ సింగ్​. ప్రకృతి పరిరక్షణలో ఎటెన్​బరో చేసిన సేవల్ని కొనియాడారు కాంగ్రెస్​ నేతలు.

Indira Gandhi Peace Prize
డేవిడ్​ ఎటెన్​బరోకు ఇందిరా శాంతి బహుమతి ప్రదానం
author img

By

Published : Sep 8, 2020, 6:44 AM IST

బ్రిటిష్​ ప్రసారకుడు డేవిడ్​ ఎటెన్​బరోకు 2019 సంవత్సరానికిగానూ ఇందిరాగాంధీ శాంతి బహుమతిని సోమవారం ప్రదానం చేశారు. దృశ్య మాధ్యమ విధానంలో నిర్వహించిన కార్యక్రమంలో మాజీ ప్రధాని మన్మోహన్​సింగ్​ ఆయనకు ఈ పురస్కారం అందించారు. ఈ సందర్భంగా ప్రకృతి పరిరక్షణలో డేవిడ్​ 50 ఏళ్ల నుంచి అందిస్తున్న సేవల్ని కొనియాడారు కాంగ్రెస్​ అధ్యక్షురాలు సోనియా గాంధీ. ప్రకృతి గురించి మానవాళికి తెలియజెప్పడానికి అద్భుతమైన చిత్రాలు, పుస్తకాల ద్వారా ఆయన విశేష కృషి చేస్తున్నారని ప్రశంసించారు.

Indira Gandhi Peace Prize
కార్యక్రమంలో మాట్లాడుతోన్న సోనియా గాంధీ

పచ్చదనంపై, వన్య ప్రాణులపై ప్రభావాన్ని చూపే ప్రాజెక్టుల విషయంలో యూపీఏ సర్కారు అత్యంత ఆచితూచి వ్యవహరించేదని, మరీ కఠినంగా వ్యవహరిస్తున్నామంటూ తమపై విమర్శలు వచ్చేవని మన్మోహన్​సింగ్​ చెప్పారు. పర్యావరణానికి అన్ని రకాలుగా హాని జరుగుతున్న ప్రస్తుత తరుణంలో శాంతి పురస్కారం పొందడానికి డేవిడ్​ను మించిన వ్యక్తి లేరని కొనియాడారు.

Indira Gandhi Peace Prize
మాజీ ప్రధాని మన్మోహన్​సింగ్​

మానవాళి అంతా జాతీయవాదం నుంచి అంతర్జాతీయవాదానికి మారాల్సిన అవసరం ఉందని డేవిడ్​ పేర్కొన్నారు. ప్రముఖ నటుడు రిచర్డ్​ ఎటెన్​బరోకు ఆయన సోదరుడు.

ఇందిరాగాంధీ శాంతి బహుమతి కింద ఏటా ఒకరికి రూ.25 లక్షల నగదు పురస్కారం అందిస్తుంటారు.

ఇదీ చూడండి: ఆ చేతులే.. ఇప్పుడు అద్భుతాలు చేస్తున్నాయ్​!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.