ఓ పత్రికలో వచ్చిన సాధారణ పెళ్లి ప్రకటన అసాధారణ రీతిలో ప్రాచుర్యం పొందింది. బంగాల్ సిలిగుడిలోని కాలియాగంజ్లో ఓ ప్రభుత్వ ఉపాధ్యాయుడు.. వధువు కావాలంటూ ప్రకటన ఇచ్చాడు. తన పేరు మాత్రం చెప్పకుండా పెళ్లికి ఓ షరతు పెట్టాడీ 42 ఏళ్ల ప్రబుద్ధుడు. అమ్మాయి పేరు మీద రూ.10 కోట్ల ఆస్తి ఉండాలన్నది అతని డిమాండ్.
భారత్లో వచ్చే పెళ్లి ప్రకటనల్లో సాధారణంగా చర్మం రంగు, ఎత్తు, జుట్టు పొడవు, ఒకే సామాజిక వర్గం అనే డిమాండ్లే కనిపిస్తాయి. అంతకు మించి అంటే ఉద్యోగం లేదా ఐఐటీ, ఐఐఎంలలో చదివి ఉండాలనో ఉంటుంది. వీటికి భిన్నంగా ఈ వింత ప్రకటనను చూడగానే పాఠకులను విపరీతంగా ఆకట్టుకుంది.
క్షణాల్లో వైరల్
ఈ ప్రకటన క్షణాల్లో సామాజిక మాధ్యామాల్లో వైరల్ అయిపోయింది. అనేక మీమ్స్ సృష్టించారు నెటిజన్లు. ఉపాధ్యాయుడికి వ్యతిరేకంగా అతని ఆలోచనను ఎండగడుతూ వ్యంగ్యంగా వింత వింత డిమాండ్లు పెడుతున్నారు.
ఈ ఘటన కాలియాగంజ్ ఉపాధ్యాయుల సంఘం దృష్టికి వచ్చింది. అయితే ప్రకటన ఇచ్చింది ఎవరన్నదీ ఇంకా తెలియరాలేదు. పరిశీలించి చర్యలు తీసుకుంటామని వారు స్పష్టం చేశారు.
ఇదీ చూడండి: కేంద్ర మంత్రిత్వ శాఖలకే టోకరా.. కోట్లు చోరీ!