ETV Bharat / bharat

బ్రిక్స్ సదస్సులో ఎదురుపడనున్న మోదీ-జిన్​పింగ్​ - మోదీ జిన్​పింగ్

బ్రిక్స్ వార్షిక శిఖరాగ్ర సమావేశం నవంబరు17న జరగనున్నట్లు రష్యా ప్రకటించింది. సరిహద్దులో తీవ్ర వివాదాలు చోటు చేసుకున్న తరువాత ప్రధాని నరేంద్ర మోదీ, చైనా అధ్యక్షుడు జిన్​పింగ్​లు మొదటిసారి ఈ సదస్సులో ఎదురుపడనున్నారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జరగనున్న ఈ భేటీకి రష్యా నేతృత్వం వహిస్తుంది.

BRICS virtual summit on Nov 17: Modi, Xi set to come face-to-face for first time since border standoff in Ladakh
బ్రిక్స్ సదస్సులో ఎదురుపడనున్న మోదీ-జిన్​పింగ్​
author img

By

Published : Oct 6, 2020, 4:48 AM IST

బ్రిక్స్ దేశాల 12వ వార్షిక సదస్సు నవంబరు 17న జరగనుంది. 'ప్రపంచ సుస్థిరత, భద్రతలో బ్రిక్స్​ భాగస్వామ్యం-వినూత్న వృద్ధి' అనే ఇతివృత్తంతో ఈసారి భేటీ నిర్వహించనున్నట్లు రష్యా తెలిపింది. కరోనా నేపథ్యంలో సమావేశం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నిర్వహిస్తున్నారు. శాంతి, భద్రత, ఆర్థికరంగం, సాంస్కృతిక తదితర విభాగాల్లో వ్యూహాత్మక సంబంధాలపై ఈ సదస్సులో చర్చించనున్నారు.

భారత్​-చైనా మధ్య ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడిన తర్వాత ప్రధాని నరేంద్ర మోదీ, జిన్​పింగ్​ తొలిసారి ఈ సమావేశంలో ఎదురుపడనున్నారు. ఈ విషయం ఆసక్తిగా మారింది. బ్రిక్స్ సదస్సుకు గత కొన్నేళ్లుగా మోదీ, జిన్​పింగ్ తప్పకుండా హాజరవుతున్నారు. గతేడాది బ్రెజిల్​లో వీరి మధ్య ద్వైపాక్షిక భేటీ జరిగింది. బ్రెజిల్​, రష్యా, భారత్​, చైనా, దక్షిణాఫ్రికాలు బ్రిక్స్​ కూటమిలో సభ్య దేశాలుగా ఉన్నాయి. ప్రపంచ జనాభాలో సగం బ్రిక్స్​ దేశాల్లోనే ఉన్నారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.