ETV Bharat / bharat

'చైనాపై కోపంతో మన టీవీలు పగలగొడితే ఏమొస్తుంది..!'

సరిహద్దు ఘర్షణలో భారత సైనికులను పొట్టనపెట్టుకున్నందుకు యావత్​ దేశం చైనాపై మండిపడుతోంది. కొందరు చైనా ఉత్పత్తులను వాడొద్దంటూ సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెడుతున్నారు. మరి కొందరు తాము కొన్న చైనా టీవీలు, ఫోన్లు, ల్యాప్​టాప్​లు ధ్వంసం చేస్తున్నారు. దీంతో మన వస్తువులను నాశనం చేసుకుంటే చైనాకు పోయేదేంటని వ్యంగ్యంగా ప్రశ్నించారు నెటిజన్లు.

breaking TV to boycott Chinese products
'చైనాపై కోపంతో మన టీవీలు పగలగొడితే ఏమోస్తుందిరా..!'
author img

By

Published : Jun 18, 2020, 8:03 PM IST

Updated : Jun 18, 2020, 8:33 PM IST

సూరత్​కు చెందిన కొందరు దేశభక్తులు.. చైనా వస్తువులను వాడొద్దంటూ నిరసనలు చేశారు. తాము ఇంట్లో వాడుతున్న టీవీ చైనాలో తయారైందేనని తెలిసి.. దానిని ముక్కలు ముక్కలు చేశారు. సామాజిక మాధ్యమాల్లో తెగ వైరల్​ అయిన ఈ వీడియోపై ట్విట్టర్​లో హాస్యాస్పదంగా స్పందిస్తున్నారు నెటిజన్లు.

నెటిజన్ల స్పందనలు కొన్ని....

  • "ఇకపై వచ్చే చైనా ఉత్పత్తులను బహిష్కరించాలి... కానీ మనం డబ్బులు వెచ్చించి కొనుక్కున్న వస్తువులను పగలగొట్టుకుంటే చైనాకు పోయేదేంటి? ఆ వస్తువుకు చైనాకు మనం ఇదివరకే డబ్బు చెల్లించేశాం కదా? ఇది మనకు నష్టం కానీ, చైనాకు కాదు."

-@రాబిన్​హుడ్​ పాండే

  • "ఆహా .. చైనా టీవీని పగలగొట్టారు. కానీ, చైనా వీడియో ఎడిటింగ్​ యాప్​ పవర్​ డైరక్టర్​లో ఈ వీడియోను భలే ఎడిట్​ చేశారు."

-ఇవాన్​ మెహతా@ఇండియన్​ ఐడిల్​

  • "అబ్బో.. టీవీలు పగులగొట్టి మనం చైనా ఆర్థిక వ్యవస్థను కూల్చేశామే...! "

-@దిల్​_వాలా_

  • "వస్తువులు బద్దలగొట్టేశాం. ఇంకేంటి.. మనమే గెలిచేశాం."

-సాహిల్​ రిజ్వాన్​@సాహిరిజ్​

చైనీస్​ ఉత్పత్తులే వద్దని...

లద్ధాఖ్​ గల్వాన్​ లోయలో చైనా ఆర్మీ చేతుల్లో దాదాపు 20 మంది భారత జవాన్లు అమరులయ్యారు. దీంతో యావత్​ దేశం రక్తం మరిగిపోయింది. ఎందరో ప్రముఖులు చైనా ఉత్పత్తులను బహిష్కరించి వారికి బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు.

భారత సరిహద్దుల్లో చైనా హింసకు పాల్పడుతున్న నేపథ్యంలో ఆ దేశ ఆహార ఉత్పత్తులను భారతీయులు బహిష్కరించాలని కేంద్ర సామాజిక న్యాయశాఖ సహాయ మంత్రి రాందాస్‌ అఠవాలే పిలుపునిచ్చారు. ప్రభుత్వం కూడా దేశంలోని చైనా హోటళ్లు, రెస్టారెంట్లపై నిషేధం విధించాలని సూచించారు. భారత్‌లో చైనా రెస్టారెంట్లు నిర్వహించేవారు వాటిని మూసివేయాలన్నారు.

ఇదీ చదవండి:చైనా వ్యూహమేంటి? గాల్వన్​ ఘటనతో లక్ష్యం నెరవేరిందా?

Last Updated : Jun 18, 2020, 8:33 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.