దిల్లీలో తీవ్ర అగ్ని ప్రమాదం జరిగింది. షాబాద్ డెయిరీ ప్రాంతంలోని మురికివాడలో తాత్కాలిక ఆవాసాలకు నిప్పంటుకుంది. ఈ ఘటనలో 70 గుడిసెలు కాలి బూడిదయ్యాయి. పలువురికి గాయాలయ్యాయి. మంటలను ఆర్పేందుకు 20 అగ్నిమాపక యంత్రాలు శ్రమించాయి.
పెద్దఎత్తున పోగుపడిన వ్యర్థాలకు మంటలు అంటుకున్ననేపథ్యంలో అగ్నికీలలు ఎగసిపడ్డాయి. సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బందిఅగ్నిమాపక యంత్రాలతో మంటల్ని అదుపులోకి తెచ్చారు. ఎలాంటి ప్రాణనష్టం సంభవించలేదు. అయితే నలుగురు చిన్నారులు కనిపించడం లేదని ఫిర్యాదు అందిందని.. వారికోసం వెతుకుతున్నట్లు అధికారులు తెలిపారు.
ఓ ఇంటిలో వంట గ్యాస్ సిలిండర్ పేలడం వల్లే ఈ ప్రమాదం జరిగినట్లు అధికారులు అనుమానిస్తున్నారు. ఇటీవలే ఈ మురికివాడలో మంటలు చెలరేగాయి. గురువారం మరోసారి మంటలు అంటుకోవడం పట్ల స్థానికులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఇదీ చూడండి: చౌకైన ఆ మూడు కొవిడ్-19 ఔషధాలు ఏంటి?