కర్ణాటక మున్నగూడలో పదేళ్ల బాలుడు కొండచిలువ బారినుంచి క్షేమంగా బయటపడ్డాడు. ఐదో తరగతి చదువుతున్న సంకల్ప్జీ పాయ్.. ఆలయానికి వెళ్లే సమయంలో ఈ ఘటన జరిగింది.
సాయంత్రం వేళ ఇంటి నుంచి గుడికి బయల్దేరగా మార్గమధ్యంలో ఉన్న మురుగునీటి పైప్ నుంచి ఓ కొండచిలువ.. పదేళ్ల సంకల్ప్ కుడి కాలిని పట్టుకుంది. తొలుత అతడు భయపడినా.. వెంటనే తేరుకొని, మరో కాలి సాయంతో చాకచక్యంగా దాని నుంచి తనను తాను విడిపించుకున్నాడు. ఇంతలో అది అతడ్ని కాటేసింది.
కొండచిలువ కాటుకు గురైనా.. ధైర్యసాహసాలు ప్రదర్శించాడు సంకల్ప్. పైపులో కొండచిలువ ఉన్న విషయం గ్రహించి.. పొరుగువారికి సమాచారమిచ్చాడు. అనంతరం స్థానికులు అక్కడికి చేరుకొని దాన్ని బంధించి, అటవీశాఖకు అప్పగించారు.
సంకల్ప్ చూపించిన ధైర్యసాహసాలకు సంబంధించిన ఫొటోలు.. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఇదీ చదవండి: పాఠం విని అత్యాచారం జరిగిందని గ్రహించిన బాలికలు