కొన్ని జాతీయ వార్తా ఛానళ్లపై ప్రముఖ బాలీవుడ్ నిర్మాతలు దిల్లీ హైకోర్టును సోమవారం ఆశ్రయించారు. చిత్ర పరిశ్రమపై బాధ్యతారాహిత్యంగా, అవమానకరంగా, పరువు నష్టం కలిగించే విధంగా ప్రసారాలు చేస్తున్నారని ఆరోపించారు. వివిధ అంశాలపై మీడియా ట్రయల్స్‌ను నిర్వహించడాన్ని అడ్డుకోవాలని కోరారు.
హైకోర్టులో దావా వేసిన వారిలో నాలుగు బాలీవుడ్ పరిశ్రమ సంఘాలతోపాటు 34 మంది ప్రముఖ నిర్మాతలు ఉన్నారు. పిటిషన్లో ప్రముఖంగా రిపబ్లిక్ టీవీ, టైమ్స్ నౌ ఛానళ్ల పేరును ప్రస్తావించారు నిర్మాతలు.
చిత్ర పరిశ్రమకు చెందిన వారి వ్యక్తిగత అంశాల్లో జోక్యం చేసుకోకుండా ఈ ఛానళ్లను నియంత్రించాలని దిల్లీ హైకోర్టును కోరారు. బాలీవుడ్ వ్యక్తుల పట్ల అసభ్యకరమైన పదాలను వినియోగిస్తున్నారంటూ.. ఆ ఛానళ్లు ప్రసారం చేసిన కొన్ని వ్యాఖ్యలను జతచేశారు.
ఇదీ చూడండి: 'సుశాంత్ కేసులో ఎయిమ్స్ నివేదికపై అనుమానాలు'