ETV Bharat / bharat

రాజస్థాన్​లో ఘోర ప్రమాదం- ఐదుగురు మృతి - కోటా లో రోడ్డు ప్రమాదం

రాజస్థాన్​లో ట్రక్కు, బొలెరో ఢీకొన్న ఘటనలో ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. మరో ఆరుగురికి తీవ్రగాయాలయ్యాయి. ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

bolero , truck accident in madhya pradesh kota
ట్రక్కు, బొలెరో ఢీ..ఐదుగురు మృతి,ఆరుగురికి గాయాలు
author img

By

Published : Dec 4, 2020, 1:00 PM IST

రాజస్థాన్​ కోటా జిల్లా దీగోద్​లో గురువారం రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరగ్గా ఐదుగురు మరణించారు.

ధాన్యం అమ్మేందుకు మధ్యప్రదేశ్ శివపుర్​ నుంచి రాజస్థాన్​ కోటా జిల్లా మండీకి 11మంది బొలెరోలో వచ్చారు. తిరుగు ప్రయాణంలో దీగోద్​​ పోలీస్​ స్టేషన్​ పరిధిలో బొలెరోను ఓ ట్రక్కు ఢీకొంది. ఈ ప్రమాదంలో బొలెరోలోని ఐదుగురు మృతిచెందారు. మిగిలిన ఆరుగురికి తీవ్ర గాయాలయ్యాయి.

వెంటనే ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు గాయపడ్డవారిని కోటాలోని ఎంబీఎస్​ ఆసుపత్రికి తరలించారు. క్షతగాత్రుల్లో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.

ఇదీ చదవండి : రైతుల ఆందోళన.. దిల్లీలో ట్రాఫిక్‌ కష్టాలు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.