ETV Bharat / bharat

బడ్జెట్​ 19: ఒకే దేశం-ఒకే​ గ్రిడ్​

విద్యుత్తును సరసమైన ధరలకు దేశంలోని అన్ని రాష్ట్రాలకు అందించేందుకు ఒకే దేశం-ఒకే గ్రిడ్​ విధానాన్ని తీసుకురానున్నట్లు ఆర్థిక మంత్రి నిర్మలాసీతారామన్​ ప్రకటించారు. విద్యుత్​తో పాటు గ్యాస్​, వాటర్​ గ్రిడ్​లు ఆవిష్కరిస్తామని తెలిపారు.

బడ్జెట్​ 19: ఒకే దేశం-ఒకే​ గ్రిడ్​
author img

By

Published : Jul 5, 2019, 12:35 PM IST

మౌలిక సదుపాయాల కల్పనలో భాగంగా మరో ముందడుగు వేయనున్నట్లు తెలిపారు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్​. దేశంలోని రాష్ట్రాలకు సరసమైన ధరకే విద్యుత్తును అందించేందుకు ఒకే దేశం-ఒకే పవర్​ గ్రిడ్​ వ్యవస్థను ఏర్పాటు చేయనున్నట్లు బడ్జెట్​లో ప్రకటించారు.

బడ్జెట్​ ప్రసంగంలో ఆర్థిక మంత్రి

జాతీయ గ్యాస్​ గ్రిడ్​, వాటర్​ గ్రిడ్​లతో పాటు సమాచార మార్గాలు, విమానాశ్రాయాలకు సరికొత్త కేంద్రీకృత వ్యవస్థను ఏర్పాటు చేస్తామని తెలిపారు. విద్యుత్ రంగంతోపాటు వ్యవస్థాగత సంస్కరణల కోసం త్వరలోనే ప్యాకేజీ అందించనున్నట్లు చెప్పారు.

భారత్​మాలా, సాగర్​మాలా, ఉడాన్​ వంటి పథకాలు గ్రామీణ-పట్టణాల మధ్య ఉన్న అంతరాలను తగ్గించాయన్నారు. రవాణా మౌలిక సదుపాయాలు మెరుగయ్యాయన్నారు. రెండో దశ భారత్​మాలా ప్రాజెక్టులో భాగంగా రవాణా వ్యవస్థ మరింత పటిష్ఠం కానుందని చెప్పారు.

రాష్ట్రాల మధ్య ఉన్న అంతరాలను తగ్గించేందుకు ఆయా ప్రభుత్వాలతో కలిసి పనిచేస్తామన్నారు ఆర్థిక మంత్రి. గతంలో ప్రయాణికుల సౌకర్యార్థం తీసుకొచ్చిన ఒకే దేశం-ఒకే కార్డు మాదిరి ఈ విధానం పనిచేయనుందని తెలిపారు.

Intro:Body:

t

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.