ETV Bharat / bharat

భాజపా ఎన్నికల అస్త్రంగా 'వీర్​ సావర్కర్​'!

author img

By

Published : Oct 18, 2019, 8:27 AM IST

ఎన్నికల ప్రచారాల్లో హిందూ మహాసభ నాయకుడు, స్వాతంత్య్ర సమరయోధుడు వీర్​ సావర్కర్​ పేరును భాజపా హైలెట్​ చేస్తోంది. విపక్షాలను ఎదుర్కోవడానికి ఆయన పేరును పదే పదే ప్రస్తావిస్తోంది కమల దళం. మహారాష్ట్ర ఎన్నికల మేనిఫెస్టోలో ఆయనకు భారతరత్న ఇవ్వాలని భాజపా ప్రతిపాదించడం విశేషం. దీనిపై కాంగ్రెస్​ సహా ఇతర రాజకీయ పార్టీల నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతోంది.

ఎన్నికల ప్రచారాల్లో 'సావర్కర్'​ను హైలెట్​ చేస్తోన్న భాజపా

వీర్​ సావర్కర్​.. హిందూ మహాసభ నాయకుడు... స్వాతంత్య్ర సమరయోధుడు... ప్రస్తుతం భాజపా ఎన్నికల ప్రచారాల్లో ఎక్కువగా వినిపిస్తున్న పేరు. ప్రధాని నరేంద్ర మోదీ, భాజపా జాతీయాధ్యక్షుడు అమిత్​ షా మహారాష్ట్ర ఎన్నికల ర్యాలీల్లో ఆయన పేరును హైలెట్​ చేస్తున్నారు. భారత స్వాతంత్య్రోద్యమానికి సావర్కర్​ చేసిన సేవల్ని ఎత్తిచూపేందుకు ప్రయత్నిస్తోంది భాజపా. విపక్షాలను ఎదుర్కోవడానికి ఇదొక ఎత్తుగడలా ఉపయోగిస్తున్నారు.

హిందుత్వ సిద్ధాంతకర్త సావర్కర్​ లేకపోయి ఉంటే... 1857లో జరిగిన ప్రథమ స్వాతంత్య్ర సంగ్రామాన్ని బ్రిటిష్​ చరిత్రకారుల కోణంలో కేవలం తిరుగుబాటుగానే పరిగణించేవారన్నారు కేంద్ర హోంమంత్రి అమిత్​ షా. వారణాసిలో జరిగిన ఓ కార్యక్రమంలో వీర్​ సావర్కర్​కు ఘననివాళి అర్పించిన షా.. చరిత్రను భారతీయ కోణంలో తిరిగి రాయాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు.

మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల కోసం తమ మేనిఫెస్టోలో సావర్కర్​కు భారతరత్న ఇచ్చేందుకు కృషి చేస్తామని ప్రతిపాదించింది భాజపా. దీనిపై దుమారం రేగుతున్న నేపథ్యంలో షా ఈ వ్యాఖ్యలు చేయడం విశేషం.

కాంగ్రెస్​కు దూరం...

వీర్​ సావర్కర్​ను కాంగ్రెస్​, ఇతర రాజకీయ పార్టీలు విమర్శిస్తూ వచ్చాయి. మహాత్మ గాంధీ హత్యతో ఆయనకు సంబంధముందని ఆరోపించాయి. అయితే.. సావర్కర్​ నిర్దోషిగా నిరూపితమైంది. ఇప్పుడు.. భారతరత్న ప్రతిపాదనను కాంగ్రెస్​ వ్యతిరేకించింది. ఈ నిర్ణయాన్ని మాజీ ప్రధాని మన్మోహన్​ సింగ్​ కూడా సమర్థించారు. అయితే... కాంగ్రెస్​ వ్యతిరేకిస్తుంది సావర్కర్​ను కాదని, ఆయన ప్రవచించిన, మద్దతిచ్చిన హిందుత్వ భావజాలాన్నేనని చెప్పారు.

గతంలో సావర్కర్​ స్మృత్యర్థం తపాలా బిళ్లను మాజీ ప్రధాని శ్రీమతి ఇందిరా గాంధీ ఆవిష్కరించారని, అందువల్ల తాము ఆయనకు వ్యతిరేకం కాదన్నారు మన్మోహన్​. 'సత్కారాలు ఎప్పుడు చేయాలి? అసలు చేయాలా? వద్దా?' అనే అంశాలను ప్రభుత్వం నిర్ణయించాలన్నారు​.

ఎందుకు వ్యతిరేకిస్తున్నారు...

అయితే... మన్మోహన్​ సింగ్​ వ్యాఖ్యలపై విమర్శలు ఎక్కుపెట్టారు భాజపా ఉపాధ్యక్షుడు వినయ్​ సహస్రబుద్ధే. సావర్కర్​ భావజాలంలోని ఏ అంశాలను సింగ్​ వ్యతిరేకిస్తున్నారో తెలుసుకోవాలనుందని విలేకర్లతో అన్నారు.

''సావర్కర్​ జాతీయత, సామాజిక న్యాయం, సమానత్వం కోసం కృషి చేశారు. ఆయనలోని ఏ భావజాలాన్ని మీరు వ్యతిరేకిస్తున్నారు. సావర్కర్​ సిద్ధాంతాలు మొత్తం దేశానికే ఆదర్శం. ఎంతో దూరదృష్టితో ఆలోచించారు. అందువల్ల ఆయనను వ్యతిరేకించడానికి ఏ కారణమూ లేదు.'

- వినయ్​ సహస్రబుద్ధే, భాజపా ఉపాధ్యక్షుడు

సావర్కర్​ గొప్ప దేశభక్తుడని... ట్వీట్​ చేశారు భాజపా ప్రధాన కార్యదర్శి పి.మురళీధర్​ రావు. 1857లో జరిగిన తిరుగుబాటును తొలి స్వాతంత్ర్య సంగ్రామంగా పేర్కొన్న ఘనత సావర్కర్​దేనని.. లేకపోతే బ్రిటిషర్లు కుట్ర చేసినట్లు ఇది సిపాయిల తిరుగుబాటుగానే నమ్మేవారన్నారు.

SAVARKAR
సావర్కర్​ గొప్ప దేశభక్తుడని ట్వీట్​ చేసిన మురళీధర్​ రావు

సావర్కర్​కు భారతరత్న డిమాండ్​ను వ్యతిరేకిస్తున్న కాంగ్రెస్​ను లక్ష్యంగా చేసుకొని విమర్శలు గుప్పించారు భాజపా ఐటీ విభాగ బాధ్యులు అమిత్​ మాలవీయ. మహాత్మగాంధీ, ఇందిరా గాంధీలు... వీర్​ సావర్కర్​ను, ఆయన సేవలను కొనియాడిన సందర్భాలను గుర్తు చేశారు.

AMIT
అమిత్​ మాలవీయ ట్వీట్​

మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో ప్రధాని మోదీ కూడా సావర్కర్​ పేరు పదే పదే ప్రస్తావిస్తున్నారు. ఆయన పాటించిన విలువలు దేశ నిర్మాణానికి ప్రాతిపదిక అవుతాయని చెప్పారు.

RESTRICTION SUMMARY: NO ACCESS ITALY
SHOTLIST:
++INCLUDES JUMP CUTS++
ANSA – NO ACCESS ITALY
Lampedusa - 17 October 2019
1. Italian coast guard rescue boat with bodies entering Lampedusa port
2. Wide of port
3. Various of bodies being removed from the boat
4. Wide of port
STORYLINE:
Italian coast guard divers have recovered seven bodies from an underwater wreck a few miles off the coast of Lampedusa on Thursday.
According to the coast guard there were 12 bodies in total found on the seabed, but others could still be found.
Using a remote camera, the Italian coast guard filmed the wreckage 61 metres below the surface of the water.
The bodies were found near what's believed to be the wreck of a migrant boat that sunk in the Mediterranean Sea last week, killing at least 13 people - all of them were women and were found on the same day of the accident.
A further 8 people remain missing and 22 people were rescued.
The wooden boat sailed from Tunisia and capsized off the Italian island of Lampedusa on the night of 6-7 October.
The tragedy happened as the vessel was within sight of a rescue ship.
As migrants spotted the ship they moved over to one side of their boat, causing it to capsize.
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.