ETV Bharat / bharat

మందిరాలు తెరవాలని భాజపా 'మహా' ఆందోళన

మహారాష్ట్ర వ్యాప్తంగా భక్తుల సందర్శనార్థం ఆలయాలు తెరవాలని డిమాండ్ చేస్తూ రాష్ట్ర భాజపా ఆందోళనలు చేపట్టింది. ముంబయిలోని సిద్ధివినాయక ఆలయం వద్ద ఆ పార్టీ నాయకులు చేపట్టిన నిరసనలు ఉద్రిక్తంగా మారాయి. బారీకేడ్లు దాటి ఆలయంలోకి ప్రవేశించేందుకు యత్నించిన నాయకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

BJP workers stage protest outside Shirdi Sai Baba Temple, demanding re-opening of places of worship in the state.
గుళ్లు తెరవాలని మహారాష్ట్లలో భాజపా ఆందోళనలు
author img

By

Published : Oct 13, 2020, 1:47 PM IST

భక్తుల కోసం మహారాష్ట్రలోని అన్ని మందిరాలను తెరవాలని డిమాండ్ చేస్తూ భాజపా రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు చేపట్టింది. ముంబయిలోని సిద్ధివినాయక ఆలయం వద్ద ఆ పార్టీ నాయకులు నిరసనకు దిగారు. పోలీసులు ఏర్పాటు చేసిన బారీకేడ్లను దాటి గుడిలోకి ప్రవేశించేందుకు ప్రయత్నించారు. దీంతో అక్కడ కాసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పోలీసులకు భాజపా శ్రేణులకు మధ్య తోపులాట జరిగింది. పరిస్థితిని అదుపుచేసేందుకు పార్టీ నాయకుడు ప్రసాద్ లాద్​ సహా కొంత మంది భాజపా కార్యకర్తలను పోలీసులు అరెస్టు చేశారు.

  • #WATCH Maharashtra: BJP leader Prasad Lad detained along with other party workers by police during a protest outside Siddhivinayak temple in Mumbai.

    BJP is organising demonstrations across the state today, demanding re-opening of all temples for devotees. pic.twitter.com/Q0U2hZm6Ie

    — ANI (@ANI) October 13, 2020 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

మహారాష్ట్రలో లిక్కర్ షాపులకు అనుమతిచ్చిన ప్రభుత్వం ఆలయాలను మాత్రం ఎందుకు తెరవడం లేదని భాజపా నేత ప్రవీణ్​ దరేకర్ ప్రశ్నించారు. మానసిక ప్రశాంతత కోసం ఆలయానికి వెళ్లే వారిని దృష్టిలో ఉంచుకోవాలన్నారు. మందిరాలపై ఆధారపడి జీవించే చిరు వ్యాపారులను ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆరోపించారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.