ETV Bharat / bharat

బంగాల్​లో భాజపా కార్యకర్తలపై లాఠీఛార్జ్

బంగాల్​లో భాజపా కార్యకర్తలపై పోలీసులు లాఠీఛార్జ్​ చేశారు. పార్టీ కార్యకర్త అరెస్టుపై ఖార్దా పోలీస్​ స్టేషన్​ వద్ద భాజపా కార్యకర్తలు ఆందోళన చేపడుతున్న క్రమంలో ఈ ఘటన జరిగింది.

BJP workers lathi-charged near police station in Bengal
బెంగాల్​లో కమలనాథులపై లాఠీఛార్జ్
author img

By

Published : Dec 24, 2020, 10:32 AM IST

Updated : Dec 24, 2020, 11:06 AM IST

బంగాల్​లోని ఉత్తర 24 పరగణాల జిల్లాలో భాజపా కార్యకర్తలపై పోలీసులు లాఠీఛార్జ్ జరిపారు. ఖార్దా ఠాణా పరిధిలో బుధవారం సాయంత్రం జరిగిన ఈ ఘటనలో ఓ మహిళా కార్యకర్త తీవ్రంగా గాయపడ్డారు.

స్టేషన్​లోకి బలవంతంగా చొచ్చుకేళ్లేందుకు కార్యకర్తలు ప్రయత్నించారని, ఈ క్రమంలో పరిస్థితిని అదుపు చేసేందుకు లాఠీ ఛార్జ్​ చేయాల్సి వచ్చిందని పోలీసులు తెలిపారు. బులెట్ రాయ్​ అనే కార్యకర్త అరెస్టును నిరసిస్తూ భాజపా శ్రేణులు ఠాణా వద్ద ధర్నా చేపట్టాయి.

బంగాల్​లో భాజపా కార్యకర్తలపై లాఠీఛార్జ్

"పోలీసుల దగ్గర నుంచి తుపాకులు లాక్కోవడానికి భాజపా కార్యకర్తలు యత్నించారు. ఈ క్రమంలో పరిస్థితిని అదుపు చేసేందుకు పోలీసులు లాఠీఛార్జ్ చేశారు."

-నిర్మల్ ఘోష్​, తృణమూల్ కాంగ్రెస్ ఎమ్మెల్యే

"మేము శాంతియుతంగానే ఆందోళన చేపట్టాము. పోలీసులు జరిపిన లాఠీఛార్జ్​లో గాయపడిన కార్యకర్తలను ఆస్పత్రికి తరలించాము."

-సయంతన్​ బసు, రాష్ట్ర భాజపా ప్రధాన కార్యదర్శి

బులెట్ రాయ్​​ అరెస్టు వెనుక..

పానిహటీ మున్సిపాలిటీలో ప్రచారం కోసం వెళ్లిన తమను బులెట్​ రాయ్​ తూపాకీ చూపి బెదిరించారంటూ తృణమూల్​ నేతలు ఆరోపిస్తున్నారు. ఈ మేరకు ఖార్దా ఠాణాలో బుధవారం ఉదయం ఫిర్యాదు చేయగా, రాయ్​ను పోలీసులు మధ్యాహ్నం అరెస్టు చేశారు.

ఇదీ చూడండి : కేంద్ర కేబినెట్​ కీలక నిర్ణయాలు ఇవే

Last Updated : Dec 24, 2020, 11:06 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.