ETV Bharat / bharat

దిల్లీ దంగల్​: 'భాజపా గెలిస్తే అభివృద్ధికి బ్రేకులు' - Delhi assembly election

దిల్లీ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఆమ్ ఆద్మీ పార్టీ నేత, దిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా... భాజపాపై తీవ్ర విమర్శలు గుప్పించారు. దిల్లీలో తమ ప్రభుత్వం విద్య, ఆరోగ్యం, మౌలిక వసతుల్లో అనేక సంస్కరణలను తీసుకొచ్చిందని ఎన్నికల్లో భాజపాను గెలిపిస్తే  తాము చేసిన మంచి పనులను నిలిపివేస్తుందని ఆరోపించారు. కేజ్రీవాల్​ సర్కారు ఐదేళ్లలో చేసిన అభివృద్ధి, భవిష్యత్తులో​ చేపట్టబోయే పనులు, భాజపా అనుసరిస్తున్న విధానాలను విమర్శిస్తూ 'ఈటీవీ భారత్'తో ప్రత్యేకంగా మాట్లాడారు సిసోడియా.

bjp-will-negate-aaps-efforts-in-education-health-sector-if-it-wins-delhi-polls-sisodia
దిల్లీ దంగల్​: భాజపా గెలిస్తే అభివృద్ధికి బ్రేకులు
author img

By

Published : Jan 28, 2020, 11:20 PM IST

Updated : Feb 28, 2020, 8:19 AM IST

ఎన్నికల ప్రచారంలో ఏవిధంగా ప్రజల ముందుకుపోతున్నారు?

ప్రభుత్వ పాఠశాలల్లో విప్లవాత్మక మార్పులను తీసుకొచ్చేందుకు సీఎం అరవింద్​ కేజ్రీవాల్ చేసిన కృషిని దిల్లీ ప్రజలు గుర్తిస్తున్నారు. భాజపా అధికారంలోకి వస్తే విద్యారంగంలో అభివృద్ధి నిలిచిపోతుంది. సర్కారు బడులు గుడారాల్లో నిర్వహించాల్సి వస్తుంది. ప్రైవేట్ స్కూళ్లలో ఫీజులను నియంత్రించడానికి మాకు చాలా సమయం పట్టింది. ఒకవేళ భాజపా గెలిస్తే నోయిడా, గురుగ్రామ్​,గాజియాబాద్​లో చేసినట్లుగానే దిల్లీలోనూ ఫీజులను పెంచుతారు.

మేం అధికారం చేపట్టిన సమయంలో పాఠశాలల్లోని ఒక్క క్లాస్​ రూమ్​లో దాదాపు 174మంది విద్యార్థులు ఉండేవారు. ప్రస్తుతం ఒక్క రూమ్​లో 70-80మంది కూర్చునేలా పాఠశాలలను అదనపు గదులతో ఆధునికీకరించాం. దిల్లీలో చేయాల్సిన పని చాలా ఉంది. ఎంతో కష్టపడి మా సర్కారు ప్రభుత్వ పాఠశాలల్లో మార్పులు తీసుకొచ్చింది.

మా ప్రభుత్వం​ ఏర్పడ్డాక దిల్లీలో 16 కొత్త కళాశాలలను ప్రారంభించాం. ఈ ఏడాది దిల్లీవ్యాప్తంగా ఉన్నత విద్యను అభ్యసించేందుకు 1.6లక్షల మంది అడ్మిషన్లు పొందారు. గత సంవత్సరం కంటే 70వేల మంది అదనంగా ఈ సంవత్సరం ఉన్నత విద్యలో చేరారు. ప్రభుత్వ పాఠశాలల్లో 60 శాతం మార్కులు సాధించిన విద్యార్థికి కూడా రాబోయే ఐదేళ్లలో మంచి కళాశాలలో ప్రవేశం లభిస్తుందని మేం హామీ ఇస్తున్నాం.

కేజ్రీవాల్​ ఎంతో వ్యయానికోర్చి దిల్లీలోని గృహ అవసరాలకు వినియోగించే విద్యుత్​ ఛార్జీలను తగ్గించారు. ఈ ఎన్నికల్లో మేం గెలిస్తే 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్​ను అందిస్తామని ప్రకటించాం. అదే భాజపా గెలిస్తే దిల్లీ వాసులు విద్యుత్​ బిల్లులను రూ.4వేల నుంచి 5 వేల వరకు చెల్లించాల్సి ఉంటుంది. ఈ విషయాలనే మేం ప్రజలకు చెబుతున్నాం. వారు కూడా అర్థం చేసుకుంటున్నారు.

దిల్లీ దంగల్​: భాజపా గెలిస్తే అభివృద్ధికి బ్రేకులు

పాఠశాలల భవన నిర్మాణాలకు లెక్కకు మించి ఖర్చు చేశారని వచ్చిన ఆరోపణలపై ఏమంటారు?

భాజపా నా ప్రతిష్ఠకు భంగం కలిగించేలా వ్యవహరిస్తోంది. నేను ఆ పార్టీపై పరువు నష్టం దావా వేస్తా. నేను అవినీతి చేశానన్న నెపంతో మా ఇంటికి భాజపా.. సీబీఐని పంపింది. సీబీఐ అధికారులు మా ఇంట్లో దాదాపు 8 గంటలు సోదాలు నిర్వహించి ఉత్తచేతులతో వెళ్లారు. (కేజ్రీవాల్​ ప్రభుత్వంలో మనీష్ సిసోడియా విద్య, ఆర్థిక, ప్రణాళికతో పాటు పలు శాఖల మంత్రిగా ఉన్నారు.)

విపక్షాల విమర్శలపై ఎలా స్పందిస్తారు?

ఇప్పుడు కాంగ్రెస్ ఎక్కడా కనిపించడం లేదు. భాజపా ఉనికి మతంపై ఆధారపడి ఉంది. రాజకీయాల్లో మతం పనికి రాదు. అందరూ మతం మాయలో పడరు.. భారతీయ జనతా పార్టీ నాయకులకు మేం చేసే అభివృద్ధి పనుల గురించి మాట్లాడే నైతిక అర్హత లేదు. ముఖ్యంగా విద్యకు వారు ఎలాంటి ప్రాముఖ్యత ఇవ్వదల్చుకోవడం లేదు.

ఆప్​ హయాంలో అవినీతి తగ్గిందనడానికి రుజువేంటి? ఎన్ని సీట్లు గెలుస్తారు?

దిల్లీలో ట్యాక్స్​ వసూలు పెరుగుతుంది. ఇది అవినీతి తగ్గుతుందనడానికి సంకేతం.. ఈ క్రమంలో పన్నులను కూడా తగ్గించాం. దీంతో దిల్లీ బడ్జెట్​ రూ. 30వేలకోట్ల నుంచి రూ.60వేల కోట్లకు పెంచగలిగాం. ఈ ఎన్నికల్లో 70సీట్లలో పోటీ చేస్తున్నాం. మేం 50నుంచి 60 స్థానాల్లో గెలుస్తామని ధీమా ఉంది. గత ఎన్నికల్లో వచ్చిన 67 సీట్లకు మించి సాధించినా ఆశ్చర్యపోనవసరం లేదు.

Intro:अद्भुत के लिए चिंडी माता की खबर के साथBody:अद्भुत के लिए चिंडी माता की खबर के साथConclusion:अद्भुत के लिए चिंडी माता की खबर के साथ
Last Updated : Feb 28, 2020, 8:19 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.