ETV Bharat / bharat

బెంగాలీల మధ్య చిచ్చుకు భాజపా యత్నం: మమత

పశ్చిమ్​ బంగ ముఖ్యమంత్రి మమత బెనర్జీ మరోసారి భాజపాపై విమర్శలు గుప్పించారు. రాష్ట్రంలో బెంగాలీలు, బెంగాలీయేతరుల మధ్య విభజనకు కాషాయ పార్టీ ప్రయత్నిస్తోందని ఆరోపించారు బెనర్జీ.

'బంగాలీల మధ్య చిచ్చుకు భాజపా యత్నం'
author img

By

Published : May 31, 2019, 7:09 AM IST

Updated : May 31, 2019, 8:07 AM IST

బెంగాలీల మధ్య చిచ్చుకు భాజపా యత్నం: మమత

యావత్​ ప్రజానీకం భాజపా పెట్టే వేధింపులకు వ్యతిరేకంగా గళం విప్పాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు బంగాల్​ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ. రాష్ట్రంలో బెంగాలీ, బెంగాలీయేతరుల మధ్య చిచ్చుకు ఆ పార్టీ ప్రయత్నిస్తోందని ఆరోపించారు తృణమూల్​ కాంగ్రెస్​ అధినేత్రి.

పశ్చిమ్​ బంగలో ప్రభుత్వాన్ని కూల్చివేసి.. రాష్ట్రపతి పాలన విధించాలని చూస్తే తన కంటే పెద్ద శత్రువు ఎవరూ ఉండరని భాజపాను హెచ్చరించారు మమతా బెనర్జీ. లోక్​సభ ఎన్నికల ఫలితాల అనంతరం రాష్ట్రంలో తృణమూల్​ కార్యకర్తలపై జరుగుతున్న హింసతో.. కమలం పార్టీపై ప్రజల్లో ద్వేషం పెరిగిపోయిందని వ్యాఖ్యానించారు మమత. ప్రతీకారం తీర్చుకోవడానికి సిద్ధంగా ఉన్నారని పేర్కొన్నారు.

రాష్ట్రంలో మత సామరస్యాన్ని దెబ్బ తీయాలని భాజపా చూస్తోందని.. అలాంటి పార్టీ అంటే తనకు ఇష్టం లేదని తెలిపారు మమతా బెనర్జీ. లోక్​సభ ఎన్నికల అనంతరం ఆమె తొలిసారి నిర్వహించిన రాజకీయ కార్యక్రమంలో ఈ వ్యాఖ్యలు చేశారు.

వారిని విడిచిపెట్టను: మమత

భాజపా కార్యకర్తలు సృష్టించిన హింసాకాండతో 400కు పైగా బెంగాలీ కుటుంబాలు రోడ్డున పడ్డాయని ఆవేదన వ్యక్తం చేశారు ముఖ్యమంత్రి. వారిని విడిచిపెట్టే ప్రసక్తే లేదని కాషాయ పార్టీని హెచ్చరించారు.

ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల ఫలితాల్లో దీదీ నేతృత్వంలోని తృణమూల్​ కాంగ్రెస్​ రాష్ట్రంలో మెరుగైన ఫలితాలను సాధించలేకపోయింది. బెంగాల్​లోని 42 స్థానాల్లో టీఎంసీ 22, భాజపా 18 సీట్లను గెల్చుకున్నాయి.

జై శ్రీరాం నినాదాలు.. మమత ఆగ్రహం

కోల్‌కతాలోని భట్పారా ప్రాంతం నుంచి మమత కాన్వాయ్‌ వెళుతుండగా కొందరు వ్యక్తులు జైశ్రీరాం నినాదాలు చేశారు. ఒక్కసారిగా ఆగ్రహానికి గురైన మమతా బెనర్జీ.. కారు దిగి వారిపై అసహనం వ్యక్తం చేశారు.

RESTRICTIONS: SNTV clients only. Use on broadcast and digital channels, including social. Available worldwide. Use within 14 days. All usage subject to rights licensed in contract. For any questions regarding rights restrictions please contact planning@sntv.com.
SHOTLIST: Roland Garros, Paris, France. 30th May 2019.
++++SHOTLIST AND FURTHER INFORMATION TO FOLLOW++++.
1.
2.
3.
4.
5.
6.
7.
8.
9.
10.
SOURCE: FFT/SNTV
DURATION: 01:27
STORYLINE:
Reaction from Alexander Zverev who reached the third round at the French Open with a  6-1, 6-3, 7-6(3) victory over Mikael Ymer of Sweden on Thursday.
It was only the second time in 11 main draw matches that Zverev has managed to win in straight sets at Roland Garros.
Last Updated : May 31, 2019, 8:07 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.