ETV Bharat / bharat

బిహార్​ ఎన్నికల కోసం భాజపా 'కమల్ కనెక్ట్'

author img

By

Published : Aug 29, 2020, 6:20 PM IST

బిహార్​ అసెంబ్లీ ఎన్నికలకు భారతీయ జనతా పార్టీ సర్వం సిద్ధం చేస్తోంది. కరోనా మహమ్మారి, వరదల బీభత్సం నేపథ్యంలో డిజిటల్​ వేదికగా ప్రజలను చేరుకునేందుకు సమగ్ర ప్రణాళికలను రూపొందిస్తోంది. ఇందుకోసం ప్రత్యేకంగా అనేక హంగులతో 'కమల్​ కనెక్ట్' యాప్​ను తీసుకురానుంది. అయితే సాంకేతికత వినియోగం తక్కువగా ఉండే బిహార్​లో భాజపా వ్యూహం పనిచేస్తుందా? అని సందేహాలు వినిపిస్తున్నాయి.

Kamal Connect
కమల్ కనెక్ట్

బిహార్ శాసనసభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ భారతీయ జనతా పార్టీ సమగ్ర ప్రణాళికను రూపొందిస్తోంది. వర్చువల్, ఆన్​లైన్​ వేదికల ద్వారా ప్రజలను చేరుకునేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టింది. ఇందుకోసం 'కమల్​ కనెక్ట్'ను విస్తృతంగా వినియోగించాలని నిర్ణయించింది.

అనేక హంగులతో..

ఈ యాప్​ను తక్కువ డేటా వినియోగించే విధంగా రూపొందించారు. ఇంటర్నెట్​ వేగం తక్కువగా ఉండే మారుమూల ప్రాంతాల్లోనూ దీనిని ఉపయోగించవచ్చు. దీని ద్వారా రాష్ట్రంలో చేపట్టిన అభివృద్ధి పనులను, ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వంలో ఎంత మంది లబ్ధిపొందారో పొందుపరిచారు. గత ఆరేళ్లలో బిహార్ కోసం కేంద్రం చేసిన కృషిని కూడా ఈ యాప్​ వివరిస్తుంది.

అంతేకాకుండా, భాజపా నేతల బహిరంగ ప్రసంగాలను కూడా ప్రజలకు చేరడానికి ఈ యాప్​ను ఉపయోగించనున్నారు. ప్రజల సమస్యలపై స్పందించే ఏర్పాటు చేశారు. ఫేస్‌బుక్, ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ వంటి సామాజిక మాధ్యమ వేదికలనూ దీనికి అనుసంధానం చేయనున్నారు.

వ్యూహం పనిచేస్తుందా..

దిల్లీ శాసనసభ ఎన్నికల్లోనూ ఇలాంటి యాప్​లను భాజపా వినియోగించింది. అయితే ఆ సమయంలో వీటిని ప్రజలు ఎక్కువగా వినియోగించలేదు. ప్రస్తుతం కరోనా సమయంలో ఈ డిజిటల్ వేదిక ప్రయోజనం చేకూర్చుతుందని భాజపా నాయకత్వం భావిస్తోంది. అయితే బిహార్​లో సాంకేతికత వినియోగం తక్కువగా ఉండటం భాజపాకు సవాలుగా మారనుంది.

బిహార్ ఎన్నికలు..

ఈ ఏడాది అక్టోబర్​-నవంబర్ సమయంలో బిహార్​ ఎన్నికలు జరగనున్నాయి. షెడ్యూల్ ప్రకారమే బిహార్ ఎన్నికలు జరుగుతాయని ప్రధాన ఎన్నికల కమిషనర్ ఆగస్టు 11న స్పష్టం చేశారు.

ఇదీ చూడండి: బిహార్ ఎన్నికల వాయిదాపై పిటిషన్​ కొట్టివేత

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.