ETV Bharat / bharat

బంగాల్​ నవరాత్రుల పూజలో పాల్గొననున్న మోదీ

author img

By

Published : Oct 22, 2020, 5:05 AM IST

నవరాత్రుల పూజల సందర్భంగా బంగాల్‌ ప్రజలనుద్దేశించి ప్రధాని నరేంద్ర మోదీ నేడు ప్రసంగించనున్నారు. ఈ ప్రసంగాన్ని బంగాల్‌లోని 294 అసెంబ్లీ స్థానాల్లోని ప్రతి పోలింగ్‌బూత్‌లో ప్రత్యక్షప్రసారం చేసేందుకు భాజపా తగిన ఏర్పాట్లు చేసింది.

PM-BENGAL
మోదీ

బంగాల్​లో నవరాత్రుల పూజల్లో ప్రధాని నరేంద్రమోదీ గురువారం పాల్గొననున్నారు. వర్చువల్​గా జరిగే 'పూజోర్ శుబికా' కార్యక్రమంలో రాష్ట్రంలోని ప్రజలను ఉద్దేశించి మాట్లాడనున్నారు. ఇందుకోసం బంగాల్​లోని భాజపా విభాగం భారీ ఏర్పాట్లు చేసింది.

దుర్గాపూజలు ప్రారంభమవుతున్న నేపథ్యంలో బంగాల్​ ప్రజలకు మోదీ శుభాకాంక్షలు తెలిపారు.

"దుర్గా పూజ జరిగే రోజు ఎంతో పవిత్రమైనది. మహాషష్టి వేడుకల్లో వీడియో కాన్ఫరెన్స్​ ద్వారా నేను భాగం పంచుకోవాలని ఉంది. ఈ సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు. చెడుపై మంచికి విజయానికి గుర్తుగా ఈ పండగను జరుపుకొంటారు. అందరికీ సంతోషం, మంచి ఆరోగ్యం ప్రసాదించాలని ప్రార్థిస్తున్నా."

- నరేంద్రమోదీ, ప్రధాని

భారీ ఏర్పాట్లు..

రాష్ట్రంలోని మొత్తం 294 నియోజకవర్గాల్లోని 78 వేల పోలింగ్​ బూత్​ల్లో మోదీ ప్రసంగాన్ని ప్రసారం చేయనున్నారు. కరోనా నేపథ్యంలో ఒక్కో బూత్​లో 25 మందికిపైగా కార్యకర్తలు, ఓటర్లు వీక్షించేలా ఏర్పాట్లు చేసినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. మోదీ ప్రసంగం ప్రారంభానికి ముందు పలు చోట్ల సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నారు.

బంగాల్​ ఎన్నికలు..

బంగాల్​లో వచ్చే ఏడాది శాసనసభ ఎన్నికలు జరగనున్నాయి. రాష్ట్రంలో అధికార తృణమూల్​ కాంగ్రెస్​కు ప్రధాన ప్రత్యర్థిగా భాజపా అవతరించింది. ఈ సారి ఎలాగైనా సీఎం మమత బెనర్జీ 10 ఏళ్ల పాలనకు ముగింపు పలుకుతామని భాజపా ధీమా వ్యక్తం చేస్తోంది.

ఇదీ చూడండి: 'దసరా స్కెచ్'తో బంగాల్​ పీఠంపై భాజపా గురి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.