ETV Bharat / bharat

కమల్​నాథ్​ సర్కార్​ భవితవ్యం తేలేది ఆరోజే...

మధ్యప్రదేశ్​లో కమల్​నాథ్​ ప్రభుత్వంపై అవిశ్వాస పరీక్షకు సిద్ధమవుతోంది భాజపా. ఈ నెల 16న బలపరీక్ష నిర్వహించాలని గవర్నర్​ను కోరనుంది.

BJP to seek floor test in MP Assembly on March 16
కమల్​నాథ్​ సర్కార్​ భవితవ్యం తేలేది ఆరోజే...
author img

By

Published : Mar 12, 2020, 3:29 PM IST

మధ్యప్రదేశ్​ అధికార​ కాంగ్రెస్​లో సంక్షోభాన్ని అనుకూలంగా మార్చుకునే ప్రయత్నాలు ముమ్మరం చేస్తోంది ప్రతిపక్ష భాజపా. 22 మంది శాసనసభ్యుల రాజీనామా నేపథ్యంలో కమల్​నాథ్​ సర్కార్​పై అవిశ్వాస తీర్మానానికి సిద్ధమవుతోంది.

"ప్రస్తుతం అధికార పార్టీకి అసెంబ్లీలో పూర్తి స్థాయి మెజారీటీ లేదు. ఈ నెల 16న రాష్ట్ర బడ్జెట్​ సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో కమల్​నాథ్ ప్రభుత్వానికి విశ్వాస పరీక్ష నిర్వహించాలని రాష్ట్ర గవర్నర్​, అసెంబ్లీ స్పీకర్​కు వినతి పత్రాన్ని అందజేస్తాము. 22 ఎమ్మెల్యేల రాజీనామాలు గవర్నర్​, స్పీకర్ వద్ద ఉన్నాయి. వాటిపై​ నిర్ణయం తీసుకోవాల్సింది వారే."

-నరోత్తం మిశ్రా, భాజపా విప్​.

మధ్యప్రదేశ్ శాసనసభలో మొత్తం సీట్ల సంఖ్య 230. ప్రస్తుతం 228 మంది సభ్యులు ఉన్నారు. అధికార కాంగ్రెస్​కు ఇంతకుముందు వరకు 114 మంది ఎమ్మెల్యేలతో పాటు నలుగురు స్వతంత్రులు, ఇద్దరు బీఎస్పీ, ఒకరు ఎస్పీ ఎమ్మెల్యేల మద్దతు ఉంది. ఇప్పుడు 22 మంది తిరుగుబాటు ఎమ్మెల్యేల రాజీనామాలు ఆమోదిస్తే.. అసెంబ్లీలో ఎమ్మెల్యేల సంఖ్య 206కు పడిపోతుంది. కాంగ్రెస్​ బలం 92కు చేరుతుంది. ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సిన మెజారిటీ బలం 104కు చేరుకోవటం వల్ల భాజపాకు ఉన్న 107 స్థానాలతో ప్రభుత్వ ఏర్పాటుకు మార్గం సుగమం అవుతుంది.

ఇదీ చూడండి:హిమాచల్​ హిమమయం- రాకపోకలకు అంతరాయం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.