ETV Bharat / bharat

ఎల్​జేపీతో మాకేం సంబంధం లేదు: భాజపా - ఎల్​జేపీ భాజపా పొత్తు బిహార్ ఎన్నికలు

చిరాగ్ పాసవాన్ నేతృత్వంలోని ఎల్​జేపీతో తమకు ఎలాంటి సంబంధం లేదని భారతీయ జనతా పార్టీ స్పష్టం చేసింది. ఓటర్లలో గందరగోళం సృష్టించేందుకు చిరాగ్ ప్రయత్నిస్తున్నారని ఆరోపించింది. ఓట్లు చీల్చడంలో ఎల్​జేపీ సఫలం కాదని విమర్శించింది. చిరాగ్ భ్రమలో ఉండకూడదని హితవు పలికింది.

BJP slams Chirag Paswan, accuses LJP of spreading confusion, lies ahead of Bihar polls
ఎల్​జేపీతో మాకేం సంబంధం లేదు: భాజపా
author img

By

Published : Oct 16, 2020, 6:05 PM IST

ఎన్డీఏ నుంచి బయటకు వచ్చిన ఎల్​జేపీ అధినేత చిరాగ్ పాసవాన్​ లక్ష్యంగా భారతీయ జనతా పార్టీ విమర్శలు చేసింది. ఎన్నికల సమయంలో ఓటర్లను గందరగోళానికి గురిచేస్తున్నారని ఆరోపించింది. ఎల్​జేపీతో ఎలాంటి సంబంధాలు లేవని స్పష్టం చేసింది.

ఇదీ చదవండి: 'జేడీయూను మేం మొదటి నుంచీ వ్యతిరేకిస్తున్నాం'

బిహార్​ ఎన్డీఏలో జేడీయూ, జీతన్​రాం మాంఝీకి చెందిన హెచ్​ఏఎం(ఎస్), వికాస్​శీల్ ఇన్సాన్​ పార్టీలు మాత్రమే ఉన్నాయని భాజపా సీనియర్ నేత ప్రకాశ్ జావడేకర్ స్పష్టం చేశారు. ఎన్డీఏ నాలుగింట మూడొంతుల మెజారిటీతో గెలుపొందుతుందని జోస్యం చెప్పారు. ఓట్లు చీల్చేడం మినహా ఎల్​జేపీ ఇంకేం చేయలేదని, ఈ విషయంలోనూ పెద్దగా ప్రభావం చూపదని అన్నారు.

ఇదీ చదవండి: బిహార్​ బరి: రాజకీయ వేడి పెంచుతోన్న 'ఎల్​జేపీ' లేఖ

"మాకు (ఎల్​జేపీతో) ఎలాంటి సంబంధాలు లేవని స్పష్టం చేయాలనుకుంటున్నా. ఇలాంటి గందరగోళం సృష్టించే రాజకీయాలు మాకు నచ్చవు."

-ప్రకాశ్ జావడేకర్, భాజపా సీనియర్ నేత

చిరాగ్ అబద్ధపు రాజకీయాలు చేస్తున్నారని భాజపా ప్రధాన కార్యదర్శి భూపేందర్ యాదవ్ అన్నారు. ఫిబ్రవరిలోనూ బిహార్ ప్రభుత్వాన్ని ప్రశంసించారని గుర్తుచేశారు.

"చిరాగ్ భ్రమలో ఉండకూడదు. భ్రమను కలిగించకూడదు, భ్రమను వ్యాప్తి చేయకూడదు."

-భూపేందర్ యాదవ్, భాజపా ప్రధాన కార్యదర్శి

ఎన్డీఏ నుంచి బయటకు వచ్చిన పాసవాన్ భాజపాకు విధేయుడిగానే ఉంటానని చెబుతూ వస్తున్నారు. ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షాపై ప్రశంసలు కురిపిస్తున్నారు. తమ సమస్య జేడీయూ అధ్యక్షుడు, బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్​తోనే అని స్పష్టం చేస్తున్నారు. నితీశ్ లక్ష్యంగా మాటల దాడి పెంచారు. దీంతో భాజపా, ఎల్​జేపీ మధ్య వ్యూహాత్మకమైన ఒప్పందం ఉందనే అనుమానాలు వెల్లువెత్తాయి.

మూడు దశల్లో జరగనున్న బిహార్ అసెంబ్లీ ఎన్నికలు అక్టోబర్ 28న ప్రారంభం కానున్నాయి. నవంబర్ 10 ఫలితాలు వెల్లడవుతాయి.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.