భాజపా, ఆర్ఎస్ఎస్ గాంధీ కుటుంబంపై ద్వేషాన్ని పెంచుకున్నాయని ఆరోపించారు కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ. ప్రధాని నరేంద్ర మోదీ సహా భాజపా, సంఘ్ నేతల మనసు నిండా తమ కుటుంబంపై విద్వేషాన్ని నింపుకున్నారని విమర్శించారు. అందుకే తన తండ్రి రాజీవ్ గాంధీపై మోదీ విమర్శలు చేస్తున్నారన్నారు రాహుల్.
మధ్యప్రదేశ్ శుజల్పుర్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు కాంగ్రెస్ అధ్యక్షుడు. భాజపా-ఆర్ఎస్ఎస్ల ద్వేషాన్ని ప్రేమతోనే జయిస్తామని వ్యాఖ్యానించారు. సార్వత్రిక ఎన్నికలను రెండు సిద్ధాంతాల మధ్య పోరుగా అభివర్ణించారు.
కాంగ్రెస్ న్యాయ్ పథకం దేశ ఆర్థికాభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు రాహుల్. అధికారంలోకి వస్తే ఏడాదిలోగా 22లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేస్తామన్నారు.
ఇదీ చూడండి: హెలికాప్టర్ మెకానిక్‌గా రాహుల్ గాంధీ!