ETV Bharat / bharat

'బిహార్​లో భాజపా, ఆర్జేడీ ప్రభుత్వం తథ్యం'

author img

By

Published : Jan 9, 2021, 10:43 AM IST

Updated : Jan 9, 2021, 11:42 AM IST

బిహార్​లో భాజపా, ఆర్జేడీ కలిసి అధికారాన్ని ఏర్పరుస్తాయని జన్​ అధికార్​ పార్టీ అధినేత పప్పూ యాదవ్​ అన్నారు. నితీష్​ కుమార్​ను ముఖ్యమంత్రి పదవి నుంచి తప్పించి తన వ్యక్తిని సీఎంగా భాజపా నియమిస్తుందని ఆరోపించారు. రాష్ట్రంలో అధికార మిత్రకూటమిల మధ్య అంతర్గత విభేదాలు మొదలయ్యాయని చెప్పారు.

BJP, RJD will form government in Bihar, claims Pappu Yadav
'బిహార్​లో భాజపా, ఆర్జేడీ ప్రభుత్వం తథ్యం'

బిహార్​లో మిత్రపక్షాలైన భాజపా, జేడీయూ మధ్య అసమ్మతి సెగలు కమ్ముకుంటున్నాయని భావిస్తున్న వేళ ..జన్​ అధికార్​ పార్టీ అధినేత పప్పూ యాదవ్​ అసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో భాజపా, ఆర్జేడీ కలిసి ప్రభుత్వాన్ని ఏర్పరుస్తాయని అన్నారు. నితీష్​ కుమార్​ను ముఖ్యమంత్రి పదవి నుంచి తప్పించి తనదైన వ్వక్తికి ఆ అధికారాన్ని భాజపా కట్టబెడుతుందని ఆరోపించారు.

నితీష్​ కుమర్​ మరో ఆరు నెలలే అధికారంలో ఉంటారని ఆ తర్వాత ప్రతిపక్షనాయకుడు తేజస్వీ యాదవ్ సీఎంగా కొనసాగుతారని జేడీయూ ఎమ్మెల్యే గోపాల్​ మండల్​ చేసిన వ్యాఖ్యలను పప్పూ యాదవ్​ గుర్తుచేశారు. బిహార్​ ఎన్నికల్లో ఎన్​డీఏ కూటమి​లో ఒక్క భాజపాకే 74 సీట్లు వచ్చాయి. జేడీయూకు 43 సీట్లే వచ్చాయి. ఎక్కువ సీట్లు సాధించిన భాజపా తన అభ్యర్థిని సీఎంగా ఎందుకు నియమించకూడదని యాదవ్​ అన్నారు.

"బిహార్​లో ఎన్​డీఏ ప్రభుత్వం ఐదేళ్లు పాలన సాగిస్తుందని భాజపా నమ్మబలుకుతున్నా క్షేత్రస్థాయిలో పరిస్థితులు అందుకు విరుద్ధంగా ఉన్నాయి. స్నేహితులుగా చెప్పుకుంటున్న భాజపా, జేడీయూ మధ్య అంతర్గత విభేదాలు మొదలయ్యాయి. ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్​ యాదవ్​, అతని కుటుంబం స్కామ్​లను ఎదుర్కొంటోంది. ఈ నేపథ్యంలో భాజపాతో కలిసే అవకాశాలు లేకపోలేదు."

పప్పూ యాదవ్​, జన్​ అధికార్​ పార్టీ అధినేత

నితీష్​ అందుకే సంతోషంగా లేరు..

బిహార్​ ఎన్నికల్లో కీలక స్థానాలను గెలుచుకుని జేడీయూకు భాజపా పెద్దన్నగా తయారయిందని పప్పూ యాదవ్ అన్నారు. స్పీకర్​, ఇద్దరు ఉప ముఖ్యమంత్రులను తన మనిషులనే భాజపా నియమించుకుందని పేర్కొన్నారు. నితీష్​ కుమార్​ సన్నిహితుడైన సుశీల్​ కుమార్​ మోదీని రాజ్యసభకు పంపింది. ముఖ్యమైన పదవులను తన చేతిలో ఉంచుకుని రాష్ట్ర క్యాబినెట్​ విస్తరించకుండా భాజపా అడ్డుకుంటోందని యాదవ్​ ఆరోపించారు. ఇందువల్లనే నితీష్​ సంతోషంగా లేరని అన్నారు.

ఇదీ చదవండి:'వారిని ఉపఎన్నికల్లో పోటీచేయనీయొద్దు'

Last Updated : Jan 9, 2021, 11:42 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.