ETV Bharat / bharat

భాజపాలో చేరిన కాసేపటికే సింధియాకు టికెట్ - MP Rajya Sabha candidate

జ్యోతిరాదిత్య సింధియాకు మధ్యప్రదేశ్ నుంచి రాజ్యసభ సీటు కేటాయించింది భాజపా. ఆయన పార్టీలో చేరిన కాసేపటికే ఈ ప్రకటన చేసింది.

BJP names Jyotiraditya Scindia as its Rajya Sabha candidate from MP
పార్టీలో చేరిన కాసేపటికే సింధియాకు రాజ్యసభ సీటు
author img

By

Published : Mar 11, 2020, 6:26 PM IST

మధ్యప్రదేశ్ నుంచి రాజ్యసభ సీటును కాంగ్రెస్ మాజీ నేత జ్యోతిరాదిత్య సింధియాకు కేటాయించింది భాజపా. అధ్యక్షుడు జేపీ నడ్డా సమక్షంలో పార్టీలో చేరిన కాసేపటికే ఈ నిర్ణయాన్ని ప్రకటించింది.

అయితే రాజ్యసభ అభ్యర్థిగా సింధియా పేరును భాజపా అధికారికంగా ప్రకటించకముందే ట్విట్టర్​లో తెలిపారు ఆ పార్టీనేత, మధ్యప్రదేశ్ ప్రతిపక్షనేత శివరాజ్ సింగ్ చౌహాన్​. ఆ తర్వాత కొద్దిసేపటికే ట్వీట్ డిలీట్ చేశారు.

మొత్తం 9 మందికి...

రాజ్యసభ సీటు కేటాయించిన 9 మంది అభ్యర్థుల పేర్లను ప్రకటించింది భాజపా. వీరిలో అసోం కాంగ్రెస్ మాజీనేత భువనేశ్వర్ కలితా, ఎన్డీఏ భాగస్వామ్య పార్టీ నేత, కేంద్ర మంత్రి రాందాస్ అఠావాలే(మహారాష్ట్ర) ఉన్నారు.

ఇదీ చూడండి: భాజపాలోకి సింధియా- ఎంపీలో సరికొత్త 'పవర్​ ప్లే'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.