కర్ణాటకలో అధికారంలోకి వచ్చిన ఒక్క రోజులోనే స్పీకర్ను మార్చే యోచనలో పడింది భాజపా. రాజీనామా చేసి స్వయంగా సభాపతి పదవి నుంచి తప్పుకోవాలని రమేశ్ కుమార్కు సూచనప్రాయంగా తెలిపారు కమలదళ నేతలు. ఒకవేళ స్పీకర్ రాజీనామా చేయకపోతే ఆయనపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టాలని భావిస్తున్నట్లు స్పష్టం చేశారు.
"సాధారణంగా అధికార పార్టీ నేతలు సభాపతిగా వ్యవహరిస్తారు. ఆ పదవిలో ప్రతిపక్షనేత ఎలా ఉంటారు" అని ప్రశ్నించారు ఓ భాజపా నేత. ముందు తమ ప్రభుత్వం సభలో విశ్వాసం నిరూపించుకుని, ఆ వెంటనే ఆర్థిక బిల్లును ఆమోదిస్తామని తెలిపారు. ఆ తర్వాత స్పీకర్ వైదొలగకపోతే ఆయనపై విశ్వాస తీర్మానం ప్రవేశపెడతామని చెప్పారు.
నాటకీయ పరిణామాల మధ్య కాంగ్రెస్, జేడీఎస్ ప్రభుత్వం కుప్పకూలింది. కర్ణాటక ముఖ్యమంత్రిగా శుక్రవారం ప్రమాణ స్వీకారం చేశారు బీఎస్ యడియూరప్ప.
ముగ్గురు అసంతృప్త ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేశారు స్పీకర్ రమేశ్ కుమార్. మిగతా ఎమ్మెల్యేలపై త్వరలోనే నిర్ణయం తీసుకుంటానని చెప్పారు.
- ఇదీ చూడండి: అమెరికాలో మోదీకి 50వేల మందితో స్వాగతం!