ETV Bharat / bharat

టీఎంసీలోకి భాజపా ఎంపీ భార్య- విడాకులు ఇస్తానన్న భర్త - సుజాత మొండల్​

బంగాల్​ రాజకీయాలు రసవత్తరంగా మారాయి. పార్టీ ఫిరాయింపులు కాపురాల్లో చిచ్చుపెడుతున్నాయి. ఆ రాష్ట్ర భాజపా ఎంపీ సౌమిత్ర ఖాన్​ భార్య సుజాత మొండల్​.. సోమవారం టీఎంసీలో చేరారు. ఆ వెంటనే.. తన భార్యకు విడాకులు ఇస్తున్నట్లు ప్రటించారు భర్త​.

BJP MP's wife joins TMC
టీఎంసీలోకి భాజపా ఎంపీ భార్య
author img

By

Published : Dec 21, 2020, 5:40 PM IST

బంగాల్​లో రాజకీయాలు కుటుంబాల మధ్య చిచ్చుపెడుతున్నాయి. అధికార టీఎంసీ నుంచి భాజపాలోకి వలసలు పెరిగిన తరుణంలో ఆ రాష్ట్ర భాజపా ఎంపీ సౌమిత్ర ఖాన్​ భార్య సుజాత ఖాన్​ అనూహ్య నిర్ణయం తీసుకున్నారు. భాజపా నేతలకు షాకిస్తూ.. టీఎంసీలో చేరారు. 2019 లోక్​సభ ఎన్నికల్లో తన భర్త విజయానికి ఎన్నో రిస్కులు తీసుకున్న తనకు సరైన గుర్తింపు లేదని ఆరోపించారు. అయితే.. ఇక్కడే అసలు కథ మొదలైంది. తన భార్య టీఎంసీలో చేరినట్లు తెలిసిన వెంటనే ఆమెకు విడాకులు ఇవ్వనున్నట్లు వెల్లడించారు ఎంపీ సౌమిత్ర ఖాన్​. తన పేరును ఎక్కడా వినియోగించుకోకూడదని స్పష్టం చేశారు.

టీఎంసీ ఎంపీ సౌగత రాయ్​, పార్టీ అధికార ప్రతినిధి కునాల్​ ఘోష్​ సమక్షంలో పార్టీలో చేరారు సుజాత మొండల్​. భాజపాపై తీవ్ర విమర్శలు చేశారు. ఈ నిర్ణయం తన భర్తపై ప్రభావం చూపుతుందా? అని అడిగిన ప్రశ్నకు.. అది ఆయన చేతిలోనే ఉందని సమాధానమిచ్చారు. ఏదో ఒకరోజు నిజానిజాలు తెలుసుకొని టీఎంసీలోకి తిరిగివస్తారన్న నమ్మకం ఉందన్నారు.

"నమ్మకస్తులను కాదని ఇటీవలే చేరిన అర్హత లేని, అవినీతి నాయకులకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు కాషాయ నేతలు. పార్లమెంట్​ ఎన్నికల్లో నా భర్త గెలుపు కోసం ఎంతో త్యాగం చేశాను. అందుకు నాకు ప్రతిఫలం ఏమీ దక్కలేదు. మమతా బెనర్జీ, దాదా అభిషేక్​ బెనర్జీ నాయకత్వంలో పని చేయాలనుకుంటున్నా. "

- సుజాత మొండల్​ ఖాన్​, భాజపా ఎంపీ భార్య

10 సంవత్సరాల బంధానికి తెర..

తన భార్య టీఎంసీలో చేరిన కొద్ది సమయానికే మీడియా సమావేశం నిర్వహించి ఆమెకు విడాకుల నోటీసులు పంపుతున్నట్లు ప్రకటించారు ఎంపీ సౌమిత్ర ఖాన్​. 10 సంవత్సరాల తమ బంధానికి తెర దించుతున్నట్లు తెలిపారు. 'భార్యభర్తల మధ్య విభేదాలు సృష్టించేందుకు వెనకాడని కొంతమంది.. మిమ్మల్ని ఏమార్చుతున్నారు. బిష్నుపుర్​ లోక్​సభ ప్రచారంలో నాకు ఒక పిల్లర్​గా మారావనేది నిజం. అయితే.. నేను 6,58,000 ఓట్లు సాధించానని మరిచిపోకు. అది నా పార్టీ, ఆ ప్రాంతంలో నాకు ఉన్న గౌరవం వల్లే సాధ్యమైంది.' అని తన భార్యకు సూచించారు సౌమిత్ర. 'ఖాన్'​ సర్​నేమ్​ను ఎక్కడా వినియోగించొద్దని, సౌమిత్ర ఖాన్​ భార్యగా చెప్పుకోవద్దని స్పష్టం చేశారు. రాజకీయంగా పూర్తి స్వేచ్ఛను ఇస్తున్నట్లు పేర్కొన్నారు.

ఇదీ చూడండి: సువేందు అధికారి రాజీనామా ఆమోదం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.