కొత్తగా ఏర్పాటైన 17వ లోక్‌సభకు పార్లమెంటు స్టాండింగ్ కమిటీల వివరాలను శుక్రవారం రాత్రి సవరించింది లోక్‌సభ సచివాలయం. గత లోకసభలో ఆర్థిక, విదేశీ వ్యవహారాల స్టాండింగ్ కమిటీలకు నేతృత్వం వహించిన కాంగ్రెస్ నేతలు శశిథరూర్, వీరప్ప మొయిలీల స్థానంలో భాజపా ఎంపీలు జయంత్ సిన్హా, పీపీ చౌదరీలను నియమించింది. 2019 లోక్‌సభ ఎన్నికల్లో మొయిలీ ఓడిపోయారు.
తిరువనంతపురం నుంచి ఎంపీగా ప్రాతినిధ్యం వహిస్తున్న కాంగ్రెస్ నేత శశి థరూర్... ఇప్పడు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ స్టాండింగ్ కమిటీకి నేతృత్వం వహించనున్నారు.
విదేశీ వ్యవహారాల స్టాండింగ్ కమిటీలో సభ్యుడిగా ఉన్న కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ.. ఇకనుంచి భద్రతా స్టాండింగ్ కమిటీలో సభ్యుడిగా ఉంటారు. ఈ పార్లమెంట్ ప్యానెల్‌కు భాజపా నేత జువల్ ఓరమ్ నేతృత్వం వహిస్తున్నారు.
ఈ మార్పులతో గతంలో రెండు పార్లమెంట్ స్టాండింగ్ కమిటీలకు నేతృత్వం వహించిన కాంగ్రెస్ ఇప్పుడు ఒకదానికే పరిమితమైంది. కేంద్ర ప్రభుత్వం సిఫారసు మేరకు స్టాండింగ్ కమిటీలను లోకసభ స్పీకర్, రాజ్యసభ ఛైర్మన్ ఏర్పాటు చేస్తారు.
ఇదీ చూడండి: ఇక యూపీ మంత్రులూ ఆదాయ పన్ను కట్టాల్సిందే..!