నోబెల్ విజేత భారతీయ-అమెరికన్ ఆర్థికవేత్త అభిజిత్ బెనర్జీ వామపక్షవాది అని కేంద్ర వాణిజ్య, పరిశ్రమలశాఖ మంత్రి పీయూష్ గోయల్ పుణెలో వ్యాఖ్యానించారు. నోబెల్ దక్కడంపై అభిజిత్‌ను అభినందిస్తూనే... ఆయనపై సునిశిత విమర్శలు గుప్పించారు.
"కాంగ్రెస్ పథకమైన 'న్యాయ్'(పేదరిక నిర్మూలన పథకం)కు అభిజిత్ బెనర్జీ మద్దతు ఇచ్చారు. అయితే భారత ప్రజలు ఆయన భావజాలాన్ని తిరస్కరించారు."
- పీయూష్ గోయెల్, కేంద్ర వాణిజ్య, పరిశ్రమలశాఖ మంత్రి
అభిజిత్ బెనర్జీ ఇటీవల భారత ఆర్థిక వ్యవస్థ అస్థిరంగా ఉందని వ్యాఖ్యానించారు. ప్రస్తుతం ఉన్న గణాంకాల ప్రకారం.. దేశ ఆర్థిక వ్యవస్థ సమీప భవిష్యత్‌లో పుంజుకునే అవకాశం లేదని విశ్లేషించారు.
ఇదీ చూడండి: ఎన్నికల్లో విజయం కోసం భాజపా చేస్తున్న మ్యాజిక్ ఇది!