సార్వత్రిక ఎన్నికల వేళ దిల్లీ రాజకీయం వేడెక్కింది. ఆమ్ ఆద్మీ పార్టీ నేత, ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌పై మరోసారి ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది భాజపా. కేజ్రీవాల్ ట్విట్టర్‌ను దుర్వినియోగం చేసి ఎన్నికల నియమావళిని ఉల్లంఘించారంటూ భాజపా ఆరోపించింది. విజేందర్ గుప్తా నేతృత్వంలోని భాజపా ప్రతినిధి బృందం ప్రధాన ఎన్నికల అధికారిని కలిసి కేజ్రీవాల్‌పై చర్య తీసుకోవాలని ఫిర్యాదు చేశారు.
''కేజ్రీవాల్ సామాజిక మాధ్యమాల ద్వారా మత విద్వేషాలు రెచ్చగొట్టి, సామాజిక వర్గాల మధ్య ఉద్రిక్తతలను ప్రేరేపించడానికి ప్రయత్నిస్తున్నారు.''
- ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదులో భాజపా
ఇదీ కారణం..
'స్వస్తిక్' గుర్తును చీపురు వెంబడిస్తున్నట్లు కేజ్రీవాల్ ఓ ట్వీట్ చేశారు. దీనిపై సామాజిక మాధ్యమాల్లో విపరీతమైన వ్యతిరేకత వచ్చింది. అనంతరం ఆప్ దిద్దుబాటు చర్యలు చేపట్టింది. ట్వీట్లో చూపినది స్వస్తిక్ కాదని, అది నాజీల గుర్తు అని వివరణ ఇచ్చింది.
గురుగ్రామ్‌లో హోలీ సందర్భంగా ఓ ముస్లిం కుటుంబంపై జరిగిన దాడిని కేజ్రీవాల్ ట్విట్టర్లో పోస్ట్ చేశారు. దీనిని భాజపా ఖండించింది. ముఖ్యమంత్రి కేజ్రీవాల్ ఉద్దేశపూర్వకంగా ఈ ఘటనకు మతం రంగు పులమాలని చూస్తున్నారని దుయ్యబట్టింది.
భాజపా ఫిర్యాదుపై స్పందించిన ఆప్ నేత రాఘవ్ చందా ఓ ట్వీట్ షేర్ చేశారు. ఓ ఇంటి ముందు ఆవు, దూడ నిలబడి భాజపాకు ప్రచారం చేస్తున్నట్లు వ్యంగ్య చిత్రం ఉంచారు.
ఇదీ చూడండి :భారత్ భేరీ: దిల్లీలో దోస్తీ...బంగాల్లో కుస్తీ!