ETV Bharat / bharat

'బిహార్​లో భాజపా-ఎల్​జేపీ కూటమి ప్రభుత్వం!' - బిహార్​ పోల్స్​

బిహార్​లో లోక్​జనశక్తి పార్టీతో కలిసి భారతీయ జనతా పార్టీ కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని జోస్యం చెప్పారు ఎల్​జేపీ అధినేత చిరాగ్​ పాసవాన్​. తమ పార్టీ అభ్యర్థులు, కార్యకర్తల అభిప్రాయాల ప్రకారం స్పష్టంగా తెలుస్తోందన్నారు. తొలి విడత ఎన్నికలు జరిగిన మరుసటి రోజునే ఈ మేరకు వ్యాఖ్యానించటం ప్రాధాన్యం సంతరించుకుంది.

chirag-paswan
చిరాగ్​ పాసవాన్
author img

By

Published : Oct 29, 2020, 3:47 PM IST

బిహార్​ తొలి విడత ఎన్నికలు జరిగిన మరుసటి రోజు కీలక వ్యాఖ్యలు చేశారు లోక్​జనశక్తి పార్టీ(ఎల్​జేపీ) అధినేత చిరాగ్​ పాసవాన్​. తమ పార్టీ అభ్యర్థులు, కార్యకర్తల అభిప్రాయం​ ప్రకారం.. బిహార్​లో ఎల్​జేపీతో కలిసి భారతీయ జనతా పార్టీ కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందన్నారు​.

" బిహార్​ అభివృద్ధి సహా నిరుద్యోగం, అవినీతి, వలసలను నిరోధించాలని కోరుకుంటున్న ప్రతి ఒక్కరు భాజపా, ఎల్​జీపీ అభ్యర్థులకు ఓటు వేస్తున్నారు. ఈసారి మార్పుకోసం బిహార్​ ప్రజలు ఓటు వేస్తున్నారు. మా పార్టీ అభ్యర్థులు, కార్యకర్తల అభిప్రాయం​ ప్రకారం.. నవంబర్​ 10 తర్వాత ముఖ్యమంత్రి నితీశ్​ కుమార్​ తన స్థానాన్ని కోల్పోతారు. బిహార్​లో భాజపా-ఎల్​జేపీ కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుంది. "

- చిరాగ్​ పాసవాన్​, ఎల్​జేపీ అధినేత

పంజాబ్​లో దసరా ఉత్సవాల్లో భాగంగా ప్రధాని మోదీ దిష్టిబొమ్మను కాల్చటంపై రాహుల్​ గాంధీ చేసిన ప్రకటనపై నితీశ్ మౌనంగా ఎందుకు ఉన్నారని ప్రశ్నించారు పాసవాన్​. కాంగ్రెస్​తో జట్టుకట్టేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. పంజాబ్​ ప్రభుత్వంపైనా విమర్శలు చేశారు. అది పంజాబ్​, ఆ రాష్ట్ర​ ప్రజల సంస్కృతి కాదని, దాని వెనుక ప్రభుత్వం ఉందని పేర్కొన్నారు.

ఇదీ చూడండి: తేజస్వీ.. ఆటవిక రాజ్యానికి రాకుమారుడు: మోదీ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.