ఎన్నికల మేనిఫెస్టోను భారతీయ జనతా పార్టీ ఈ నెల 8న... అంటే సార్వత్రిక ఎన్నికల తొలి దశ పోలింగ్ జరిగే మూడు రోజుల ముందు విడుదల చేయనుంది. కార్యక్రమంలో ప్రధాని మోదీ, భాజపా జాతీయాధ్యక్షుడు అమిత్‌షా సహా పార్టీ ముఖ్య నేతలు పాల్గొననున్నారు.
" పార్టీ సంకల్ప్ పత్ర(మేనిఫెస్టో) ఏప్రిల్ 8న విడుదల అవుతుంది. ప్రధాని నరేంద్ర మోదీ, భాజపా జాతీయాధ్యక్షుడు అమిత్ షా సహా పార్టీ అగ్రనేతలంతా కార్యక్రమానికి హాజరవుతారు." - భాజపా సీనియర్ నేత
20 మందితో కమిటీ
20 మంది సభ్యులతో మేనిఫెస్టో రూపకల్పన కమిటీని ఏర్పాటు చేసింది భాజపా. కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్ సారథ్యంలోని ఈ కమిటీలో ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ కూడా సభ్యుడు. అన్ని ఉప కమిటీల నుంచి ప్రతిపాదనలను ఈ కమిటీ స్వీకరించింది.
ప్రజల సలహాలూ స్వీకరించింది భాజపా. దేశవ్యాప్తంగా నిర్వహించిన 300కు పైగా రథయాత్రల్లో బాక్సులను ఏర్పాటు చేసింది. వాటి ద్వారా ప్రజల అభిప్రాయాలను, సూచనలను స్వీకరించింది. అలాగే ఈ-మెయిల్‌కు వచ్చిన వాటిని పరిశీలించింది. అన్ని రాష్ట్రాల్లో నిర్వహించిన బహిరంగ సభల్లో వచ్చిన వినతులను పరిశీలిస్తోంది.