రాజస్థాన్ భాజపా అధ్యక్షుడు మదన్‌లాల్ సైనీ మృతి పట్ల ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సహా పలువురు రాజకీయ ప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఊపిరితిత్తుల సమస్యతో కొన్ని రోజులుగా బాధ పడుతున్న సైనీ సోమవారం దిల్లీలోని ఎయిమ్స్‌లో తుదిశ్వాస విడిచారు.
సైనీ మరణం భాజపాకు తీరని లోటని ప్రధాని మోదీ అన్నారు. రాజస్థాన్‌లో పార్టీ బలోపేతానికి సైనీ ఎంతో శ్రమించారని ట్వీట్ చేశారు.
సైనీ భౌతికకాయానికి ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు నివాళులర్పించారు. రాజస్థాన్ భాజపా అధ్యక్షుడి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.
కేంద్ర హోంమంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, భాజపా కార్యనిర్వాహక అధ్యక్షుడు జేపీ నడ్డా తదితరులు ఎయిమ్స్‌లోని సైనీ భౌతికకాయాన్ని సందర్శించారు.
ఇదీ చూడండి:- విదేశాల్లో భారతీయుల నల్లధనం రూ.34 లక్షల కోట్లు?