దిల్లీ శాసనసభ ఎన్నికలను పురస్కరించుకుని భాజపా నేత కపిల్ మిశ్రా చేసిన ట్వీట్ వివాదాస్పదమైంది. ఫిబ్రవరి 8న దిల్లీ అసెంబ్లీ ఎన్నికలు జరగనుండగా.. ఆ రోజున వీధుల్లో భారత్, పాకిస్థాన్ పోటీ పడతాయని మిశ్రా ట్వీట్ చేశారు.
నోటీసులు..
కపిల్ మిశ్రా ట్వీట్‌పై కాంగ్రెస్, ఆమ్ఆద్మీ పార్టీలు విమర్శలు గుప్పించాయి. మరోవైపు ట్వీట్‌పై వివరణ ఇవ్వాల్సిందిగా రిటర్నింగ్ అధికారి మిశ్రాకు.. నోటీసులు జారీ చేశారు. ఎన్నికల సంఘం కూడా.. ట్వీట్‌కు సంబంధించి దిల్లీ ఎన్నికల ప్రధానాధికారిని నివేదిక కోరింది. 24 గంటల్లో సమర్పించాలని ఆదేశించింది. అయితే తన వ్యాఖ్యలను మిశ్రా సమర్థించుకున్నారు. నోటీసులకు వివరణ ఇస్తానని తెలిపారు.
కపిల్ మిశ్రా గతేడాది ఆగస్టులో భారతీయ జనతా పార్టీలో చేరారు. ఆప్ మహిళా విభాగం చీఫ్ రిచాపాండేతో కలిసి ఆయన కాషాయపార్టీ తీర్థం పుచ్చుకున్నారు.
ఇదీ చూడండి: దిల్లీ దంగల్: 'కామ్ కీ చాయ్'తో ఆప్ నయా ప్రచారం