ETV Bharat / bharat

ట్రాక్టర్ కాలిస్తే ఎవరికి నష్టం: అమరీందర్ సింగ్ - india gate tractor burning bjp congress

దిల్లీలో కాంగ్రెస్ నేతలు ట్రాక్టర్ దహనం చేయడంపై భాజపా ఆగ్రహం వ్యక్తం చేసింది. కాంగ్రెస్ చేసిన 'డ్రామా' వల్ల దేశం సిగ్గుపడుతోందని వ్యాఖ్యానించింది. ప్రచారాల కోసమే రైతులను కాంగ్రెస్ తప్పుదోవ పట్టిస్తోందని మండిపడింది. అయితే ట్రాక్టర్​ను కాల్చేస్తే మీకేం నష్టమంటూ పంజాబ్ ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్ ప్రశ్నించారు.

BJP hits out at Congress over tractor-burning incident near India Gate
ట్రాక్టర్ కాలిస్తే ఎవరికి నష్టం: అమరీందర్ సింగ్
author img

By

Published : Sep 28, 2020, 6:14 PM IST

పంజాబ్ యువజన కాంగ్రెస్ నేతలు ఇండియా గేట్ సమీపంలో ట్రాక్టర్​ను దహనం చేయడంపై భాజపా మండిపడింది. ప్రచారం కోసం రాజధానిలో డ్రామాలు చేసి దేశం సిగ్గుపడేలా చేసిందని ఆగ్రహం వ్యక్తం చేసింది.

రైతులను తప్పుదోవ పట్టించేందుకే పార్టీ ఇలాంటివి చేస్తోందని కేంద్ర మంత్రి ప్రకాశ్ జావడేకర్ ఆరోపించారు. ట్రాక్టర్ కాల్చివేతను తీవ్రంగా తప్పుబట్టారు.

"ట్రాక్టర్​ను ట్రక్కులో తీసుకొచ్చి ఇండియా గేట్ వద్ద కాల్చేసి కాంగ్రెస్.. దేశాన్ని సిగ్గుపడేలా చేసింది. కాంగ్రెస్ చేసిన డ్రామాను పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం. రైతుల పేరిట రాజకీయాలు చేస్తున్నారు. ఆ విషయం ఇప్పుడు బయటపడింది. ప్రచారాల కోసమే కాంగ్రెస్ డ్రామాలు చేస్తోంది."

-ప్రకాశ్ జావడేకర్, కేంద్ర మంత్రి

భాజపా తన మేనిఫెస్టోలోనే ఈ వాగ్దానం చేసిందని.. దాన్ని మోదీ ప్రభుత్వం నిలబెట్టుకుందని అన్నారు జావడేకర్. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ సైతం ఈ విషయంపై ఒకప్పుడు సానుకూలంగానే మాట్లాడారని, ఇప్పుడు కాంగ్రెస్ మాత్రం రైతులను మభ్యపెడుతోందని విమర్శించారు. అందుకే ఆ పార్టీ క్రమంగా ప్రజలతో సంబంధాలు కోల్పోతోందని చురకలంటించారు.

ఇదీ చదవండి- వ్యవసాయ చట్టాలను నిరసిస్తూ దేశవ్యాప్తంగా రైతుల ఆందోళనలు

స్వతంత్ర సమర యోధుడు భగత్ సింగ్ పేరుతో కాంగ్రెస్ పార్టీ.. రైతు వ్యతిరేక నిరసనలు చేస్తోందని కేంద్ర మంత్రి గజేంద్ర షెకావత్ విమర్శించారు. కాంగ్రెస్ చేసిన కుట్రలు ఇప్పుడు బయటపడ్డాయన్నారు.

భాజపా ప్రధాన కార్యదర్శి భూపేందర్ యాదవ్ సైతం కాంగ్రెస్​ లక్ష్యంగా తీవ్ర విమర్శలు చేశారు. కాంగ్రెస్​ను రైతు వ్యతిరేక పార్టీగా అభివర్ణించారు. వ్యవసాయ పరికరాలకు ఏ రైతు నిప్పు అంటించుకోడని అన్నారు.

ట్రాక్టర్ కొనివ్వాల్సింది పోయి...

మరోవైపు కాంగ్రెస్ లక్ష్యంగా భారతీయ జనతా యువ మోర్చా అధ్యక్షుడు తేజస్వీ సూర్య ఘాటు వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వం తీసుకొచ్చిన రైతు సంస్కరణలకు వ్యతిరేకంగా.. ఆస్తులను ధ్వంసం చేయడం బాధాకరమన్నారు. వ్యవసాయదారులకు మద్దతు ఇవ్వాలనుకుంటే పేద రైతులకు ట్రాక్టర్లు పంపిణీ చేయాల్సిందని అభిప్రాయపడ్డారు.

మీకేం నొప్పి!

దిల్లీలోని ఇండియా గేట్ సమీపంలో పంజాబ్ యువజన కాంగ్రెస్ నేతలు ట్రాక్టర్ దహనం చేయడంపై ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత అమరీందర్ సింగ్ స్పందించారు. ట్రాక్టర్​ను కాల్చివేస్తే ఎవరికి నష్టమని వ్యాఖ్యానించారు.

  • #WATCH If I have a tractor and I set it on fire, why should it bother anyone else?: Punjab Chief Minister Amarinder Singh on burning of a tractor near India Gate in Delhi by Punjab Youth Congress workers during a protest against the #FarmBills pic.twitter.com/5sb1JK6WgG

    — ANI (@ANI) September 28, 2020 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

"నాకో ట్రాక్టర్ ఉండి, దానికి నిప్పు పెడితే.. వేరే వారికి ఎందుకు నష్టం కలుగుతుంది?"

-అమరీందర్ సింగ్, పంజాబ్ ముఖ్యమంత్రి

ఇదీ చదవండి

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.