ETV Bharat / bharat

వాట్సాప్ వివాదం- కేంద్రంపై రాహుల్ ఫైర్ - భాజపా వాట్సాప్ రాహుల్ గాంధీ

వాట్సాప్​పై భాజపాకు పూర్తి పట్టు ఉందని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఆరోపించారు. వాట్సాప్​కు భారత్​లో పేమెంట్ సర్వీసులు ప్రారంభించేందుకు కేంద్ర ప్రభుత్వం అనుమతులు అవసరమని వ్యాఖ్యానించారు. ఇరువురి మధ్య సంబంధాలను అమెరికా టైమ్ మ్యాగజైన్ బయటపెట్టిందని ట్వీట్ చేశారు.

BJP has hold over WhatsApp: Rahul Gandhi
వాట్సాప్ వివాదం- కేంద్రంపై రాహుల్ ఫైర్
author img

By

Published : Aug 29, 2020, 4:19 PM IST

ఫేస్​బుక్ అంశంపై భాజపాపై తీవ్రంగా విరుచుకువడ్డ కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ తాజాగా ఇదే విషయంలో మోదీ సర్కార్​పై విమర్శనాస్త్రాలు సంధించారు. ఫేస్​బుక్ అధీనంలోని వాట్సాప్​పై భాజపాకు పట్టు ఉందని ఆరోపించారు.

భాజపా-వాట్సాప్ మధ్య ఉన్న సంబంధాలను టైమ్ మ్యాగజైన్ బయటపెట్టిందని ట్వీట్ చేశారు రాహుల్. భారత్​లో పేమెంట్ సర్వీసులు ప్రారంభించేందుకు వాట్సాప్​ ప్రయత్నిస్తోందని.. ఇందుకు కేంద్ర ప్రభుత్వం అనుమతి అవసరమని పేర్కొన్నారు.

BJP has hold over WhatsApp: Rahul Gandhi
రాహుల్ గాంధీ ట్వీట్

"భాజపా-వాట్సాప్ మధ్య ఉన్న బంధాన్ని అమెరికాకు చెందిన టైమ్ మ్యాగజైన్ బయటపెట్టింది. 40 కోట్ల మంది భారతీయులు ఉపయోగిస్తున్న వాట్సాప్... మోదీ ప్రభుత్వ అనుమతితో పేమెంట్ సేవల కోసం ప్రయత్నిస్తోంది. ఈ విధంగా వాట్సాప్​పై భాజపాకు పట్టు ఉంది."

-రాహుల్ గాంధీ ట్వీట్

ఆగస్టు 16న భాజపా, ఆరెస్సెస్ లక్ష్యంగా తీవ్ర విమర్శలు చేశారు రాహుల్. ఫేస్​బుక్​, వాట్సాప్​ను భాజపా, ఆరెస్సెస్​లకు పూర్తిగా నియంత్రిస్తున్నాయని ఆరోపించారు. ఈ సామాజిక మాధ్యమాల ద్వారా విద్వేష ప్రసంగాలు చేసి ఓటర్లను ప్రభావితం చేస్తున్నారని ధ్వజమెత్తారు. ఫేస్​బుక్, భాజపా మధ్య సంబంధాలు ఉన్నాయంటూ అమెరికా పత్రిక కథనాన్ని అప్పట్లో ప్రస్తావించారు.

ఇవీ చదవండి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.