ETV Bharat / bharat

బడ్జెట్​పై భాజపా హర్షం... మోదీ-నిర్మలపై ప్రశంసల వర్షం

బడ్జెట్​ 2020పై భాజపా నేతలు హర్షం వ్యక్తం చేశారు. పద్దును రైతులు, సామాన్యులకు ఉపయోగకరంగా తీర్చిదిద్దారని ప్రధాని మోదీ, ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్​కు అభినందనలు తెలిపారు అమిత్​ షా. ఈ బడ్జెట్​ చారిత్రకమని, భారత్​ వృద్ధికి తోడ్పడుతుందని రాజ్​నాథ్​తో పాటు పలువురు నేతలు అభిప్రాయపడ్డారు.

BJP HAILS BUDGET 2020, PRAISES MODI AND NIRMALA
బడ్జెట్​పై భాజపా హర్షం... మోదీ-నిర్మలపై ప్రశంసల వర్షం
author img

By

Published : Feb 1, 2020, 5:28 PM IST

Updated : Feb 28, 2020, 7:10 PM IST

నిర్మలా సీతారామన్​ ప్రవేశపెట్టిన బడ్జెట్ 2020​పై భాజపా అగ్రనేతలు హర్షం వ్యక్తం చేశారు. మోదీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన పద్దు వల్ల పన్ను చెల్లింపు దారులకు అసాధారణ రీతిలో ఉపశమనం కలుగుతుందని కేంద్ర హోంమంత్రి అమిత్​ షా ఉద్ఘాటించారు. రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేయాలన్న కేంద్రం సంకల్పానికి ఈ బడ్జెట్​ ఎన్నో విధాలుగా దోహద పడుతుందని అభిప్రాయపడ్డారు.

BJP HAILS BUDGET 2020, PRAISES MODI AND NIRMALA
షా ట్వీట్​

"రైతులు, పేద, మధ్య తరగతి, వ్యాపార వర్గాలు లబ్ధిపొందే విధంగా బడ్జెట్​​ను రూపొందించిన ప్రధాని మోదీ, ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్​కు నా అభినందనలు. ధాన్యం నిల్వ, నీటిపారుదలలో విధించిన నిబంధనలు.. రైతుల ఆదాయన్ని రెట్టింపు చేయాలన్న మోదీ ప్రభుత్వ సంకల్పానికి దోహద పడతాయి. మౌలిక వసతులకు ఊతమివ్వడం, సహేతుకమైన పన్ను వ్యవస్థ, సులభతర వాణిజ్యంలో పెట్టుబడులు, బ్యాంకింగ్​ రంగాన్ని బలోపేతం చేయడానికి మోదీ ప్రభుత్వం చేపట్టిన చర్యలు... భారత్​ను 5 లక్షల కోట్ల డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దేందుకు ఉపయోగపడతాయి."
--- అమిత్​ షా, కేంద్ర హోంమంత్రి.

పద్దుతో భారత్​ వృద్ధి...

నిర్మలా సీతారామన్​ ప్రవేశపెట్టిన బడ్జెట్​పై ప్రశంసల వర్షం కురిపించారు రక్షణమంత్రి రాజ్​నాథ్​ సింగ్​.

రాజ్​నాథ్​ ట్వీట్​

"నూతన దశాబ్దంలో ఆర్థికమంత్రి నిర్మలా ప్రవేశపెట్టిన బడ్జెట్​.. భారత విశ్వాసాన్ని పెంపొందించుతుంది. ఈ ఆశాజనక, ప్రగతిశీల బడ్జెట్​ వల్ల రానున్న కాలంలో భారత్ ఎంతో ఆరోగ్యవంతంగా, సంపన్న దేశంగా మారుతుంది."
--- రాజ్​నాథ్​ సింగ్​, రక్షణమంత్రి.

బడ్జెట్​ 2020 చారిత్రకమని.. అనేక అంశాలు సమతూకంగా ఉన్నాయని కేంద్రమంత్రులు ధర్మేంద్ర ప్రధాన్​, పీయుష్​ గోయల్​ తెలిపారు.

Last Updated : Feb 28, 2020, 7:10 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.