కర్ణాటకలో కాంగ్రెస్-జేడీఎస్ కూటమి బలపరీక్ష ఓటమితో భాజపా శ్రేణులు సంబరాల్లో మునిగితేలుతున్నాయి. రాష్ట్ర భాజపా కార్యాలయం వద్ద, జిల్లా కేంద్రాల్లో ఊరేగింపుగా సంబరాలు జరుపుకున్నారు. అవినీతి కూటమి శకం ముగిసిందన్నారు భాజపా నేత యడ్యూరప్ప. ప్రభుత్వ ఏర్పాటుపై ప్రధానమంత్రి నరేంద్రమోదీ, పార్టీ జాతీయాధ్యక్షుడు అమిత్‌షాతో చర్చించాకే గవర్నర్‌తో భేటీ అవుతానని స్పష్టం చేశారు.
నూతన ప్రభుత్వంలో అభివృద్ధి రాజకీయాలు ప్రారంభమౌతాయని వ్యాఖ్యానించారు.సంకీర్ణ కూటమి ప్రజాస్వామ్య విజయమని ఉద్ఘాటించారు. కుమారస్వామి పాలనతో ప్రజలు విసిగిపోయారన్నారు. కరవు కారణంగా రాష్ట్రంలో రైతులు ఇబ్బందులు పడ్డారని, తమ ప్రభుత్వంలో రైతులకు మరింత ప్రాధాన్యం కల్పిస్తామన్నారు.
"అవినీతి శకానికి ముగింపు లభించింది. సమర్థమైన ప్రభుత్వాన్ని అందిస్తామని కర్ణాటక ప్రజలకు హామి ఇస్తున్నాం. మరోసారి కర్ణాటకను సుభిక్షం చేస్తాం."
-ట్విట్టర్లో కర్ణాటక భాజపా