మహారాష్ట్రలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వ ఏర్పాటు చేయడంపై కాంగ్రెస్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడింది. భాజపా... ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం అక్రమమని కాంగ్రెస్ అభివర్ణించింది.
దేవేంద్ర ఫడణవీస్ మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడం భారత ప్రజాస్వామ్యంలోనే చీకటి అధ్యాయంగా కాంగ్రెస్ విమర్శించింది. భాజపాకు మెజారిటీ ఎమ్మెల్యేల మద్దతు ఉందా లేదా అన్న విషయంపై గవర్నర్ భగత్‌సింగ్ కోశ్యారీ కనీస విచారణ చేయలేదని కాంగ్రెస్ ఆరోపించింది.
అజిత్ పవార్ అవకాశవాది అని, ఆయన్ని భయపెట్టి భాజపా మద్దతు కూడగట్టుకుందని కాంగ్రెస్ అధికార ప్రతినిధి సుర్జేవాలా అన్నారు. అజిత్ పవార్‌ను జైల్లో పెడతానన్న ఫడణవీసే ఇప్పుడు ఆయనతో చేతులు కలిపారని ఎద్దేవా చేశారు.
ఇదీ చూడండి: ఎన్సీపీ ఎప్పుడూ భాజపాతో చేతులు కలపదు: పవార్