సార్వత్రిక ఎన్నికల సమీపిస్తున్న వేళ ఒడిశా అధికార పార్టీ బిజు దనతా దళ్ ఓ వీడియోను విడుదల చేసింది. ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ వ్యాయామం చేస్తున్న దృశ్యాలు అందులో ఉన్నాయి.
ఈ వీడియో 2 నిమిషాల9 సెకన్ల నిడివితో ఉంది. ఒడిశా ప్రజల కోసం పోరాడేందుకు సిద్ధమవుతున్నానని వీడియో చివర్లో అన్నారు సీఎం పట్నాయక్.
ముఖ్యమంత్రి ఆరోగ్యం బాగోలేదంటూ పుకార్లు వస్తున్న తరుణంలో ఈ వీడియోను విడుదల చేసింది బిజూ దనతా దళ్.