ఏటా వేసవిలో ఉష్ణోగ్రతల స్థాయి పెరుగుతూ వస్తోంది. భూతాపంతో మార్చిలోనే కొన్నిచోట్ల 45 డిగ్రీల సెల్సియస్‌తో విరుచుకుపడుతోంది ఎండాకాలం. మధ్యాహ్నం వేళ బయటకు వెళ్లామా అంతే సంగతులు. మనుషుల పరిస్థితే ఇలా ఉంటే పక్షుల విషయంలో అంతకు మించి అన్నట్టు ఉంటుంది.
గుజరాత్ అహ్మదాబాద్‌లో వేసవి తాపానికి రాలిపోతున్న పక్షులను కాపాడే పనిలో పడ్డాయి కొన్ని స్వచ్ఛంద సంస్థలు. అందుకోసం ఓ ఆసుపత్రిని ఏర్పాటు చేశాయి.
నగరంలో వేడి తీవ్రత కారణంగా అస్వస్థతకు గురవుతున్న పక్షులను గుర్తించి వాటిని ఆసుపత్రికి తీసుకువస్తారు. త్వరగా కోలుకునేలా ప్రాథమిక చికిత్స చేస్తారు. డీహైడ్రేషన్ తగ్గేందుకు ఓఆర్ఎస్ నీటిని అనివార్యంగా అందిస్తారు. ఆరోగ్యం మెరుగయ్యేంత వరకు పర్యవేక్షణలోనే ఉంచుతారు. మంచి ఆహారం అందిస్తారు. పక్షులు పూర్తిగా కోలుకున్నాక వదిలిపెడతారు.
ఇదీ చూడండి: రాహుల్ పౌరసత్వంపై రాజకీయ దుమారం