ప్రధాని నరేంద్రమోదీ జీవితచరిత్ర ఆధారంగా తెరకెక్కిన 'పీఎం నరేంద్ర మోదీ' చిత్రాన్ని పూర్తిగా చూసి నిషేధించాలో లేదో నిర్ణయం తీసుకోవాలని కేంద్ర ఎన్నికల సంఘాన్ని సర్వోన్నత న్యాయస్థానం ఆదేశించింది. ఈనెల 19లోపు నిర్ణయాన్ని సీల్డ్ కవర్లో సమర్పించాలని సూచించింది.
ఎన్నికల సమయంలో చిత్ర విడుదలను ఈసీ నిషేధించడాన్ని వ్యతిరేకిస్తూ చిత్ర నిర్మాతలు దాఖలు చేసిన పిటిషన్పై సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది.
ఎన్నికల సంఘం పూర్తి సినిమాను చూడలేదని ప్రోమోను మాత్రమే చూసి నిర్ణయం తీసుకుందని పిటిషనర్ తరఫు న్యాయవాది ముకుల్ రొహత్గి వాదించారు. పూర్తి సినిమాను చూసి నిర్ణయం తీసుకోవాలని అభ్యర్థించారు. ఇందుకు సుప్రీం సానుకూలంగా స్పందించింది. విచారణను ఈ నెల 22కు వాయిదా వేసింది.
- ఇదీ చూడండి: జయప్రదపై ఆజంఖాన్ అనుచిత వ్యాఖ్యలు