ETV Bharat / bharat

ఆ రాష్ట్రంలో మరో ఎమ్మెల్యేకు కరోనా పాజిటివ్​ - ఆర్​జేడీ ఎమ్మెల్యే ఆలం

బిహార్​లో ఆర్​జేడీ ఎమ్మెల్యే షహ్నావాజ్​ ఆలంకు కరోనా పాజిటివ్​గా తేలినట్లు అధికారులు వెల్లడించారు. ఇప్పటివరకు ఆ రాష్ట్రంలో ముగ్గురు ఎమ్మెల్యేలకు వైరస్ సోకింది.

Bihar: RJD MLA tests positive for COVID-19
ఆ రాష్ట్రంలో మరో ఎమ్మెల్యేకు కరోనా పాజిటివ్​
author img

By

Published : Jul 2, 2020, 12:34 PM IST

కరోనా వైరస్​ సామాన్యుల నుంచి ప్రజాప్రతినిధుల వరకు అందర్నీ బెంబేలెత్తిస్తోంది. బిహార్​లో మరో ప్రజాప్రతినిధికి కొవిడ్​-19 సోకింది. ప్రతిపక్ష పార్టీ ఆర్​జేడీకి చెందిన ఎమ్మెల్యే షహ్నావాజ్ ఆలంకు కరోనా సోకినట్లు అధికారులు తెలిపారు. ఆయనతో కలిపి బిహార్​లో ఇప్పటివరకు ముగ్గురు శాసనసభ్యులు వైరస్​ బారిన పడ్డారు.

సదరు ఎమ్మెల్యే అరియారియా జిల్లాలోని జోకిహాట్ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఆలంకు ఎటువంటి వైరస్​ లక్షణాలు లేవని.. అయినప్పటికీ పాజిటివ్​గా నిర్ధరణ అయినట్లు వైద్యులు తెలిపారు. పాటిజివ్​ అని తేలిన వెంటనే ఆయన స్వీయ నిర్బంధంలోకి వెళ్లినట్లు వెల్లడించారు. దీంతో అప్రమత్తం అయిన అధికారులు.. ఎమ్మెల్యేతో సంబంధం ఉన్న వారిని వెతికే పనిలో నిమగ్నమయ్యారు.

ఇప్పటికే ఆ రాష్ట్ర మంత్రి వినోద్ కుమార్ సింగ్, అతని భార్యకు వైరస్​ పాజిటివ్​ అని తేలగా, భాజపా ఎమ్మెల్యే జిబేష్ కుమార్ మిశ్రా కూడా వైరస్​ బారిన పడ్డారు.

ఇదీ చూడండి:అయితే ఏంటి? చేరకపోతే ఉద్యోగాలు పోతాయ్​!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.