దేశంలో కరోనా వైరస్ కేసుల సంఖ్య 396కు చేరింది. ఈ మేరకు భారత వైద్య పరిశోధనా మండలి(ఐసీఎంఆర్) స్పష్టం చేసింది.
దేశంలో 396కు చేరిన కరోనా కేసులు
23:10 March 22
21:37 March 22
దేశంలో కరోనా కేసుల సంఖ్య పెరుగుతోంది. ఇప్పటివరకు భారత్‌లో 360 మందికి వైరస్ సోకినట్లు ధ్రువీకరించింది కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ. ఇందులో 41 మంది విదేశీయులున్నట్లు పేర్కొంది. ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు. ఇద్దరు మహారాష్ట్రకు చెందినవారుకాగా, కర్ణాటక, పంజాబ్, బిహార్, గుజరాత్, దిల్లీల్లో ఒక్కొక్కరు చొప్పున మరణించారు.
బాధితుల్లో మరో 24 మంది కోలుకున్నట్లు స్పష్టం చేశారు అధికారులు. ప్రస్తుతం 329 యాక్టివ్ కేసులు ఉన్నట్లు వెల్లడించారు.
ముగ్గురు విదేశీయులతో మహారాష్ట్రలో మొత్తం 67 మంది వైరస్ బాధితులున్నారు. కేరళ 52, దిల్లీ 29, ఉత్తర్‌ప్రదేశ్ 27 కేసులతో వరుసగా తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. కర్ణాటకలో 26, రాజస్థాన్‌లో 24, తెలంగాణలో 22 మందికి కొవిడ్ సోకింది.
18:01 March 22
రాజస్థాన్‌లో 26 మందికి కరోనా..
జోధ్‌పుర్‌లో తాజాగా ఒకరికి కొవిడ్-19 వైరస్ సోకింది. రాజస్థాన్‌లో మొత్తం 26 మందికి కరోనా పాజిటివ్‌గా తేలినట్లు రాష్ట్ర ఆరోగ్య శాఖ అదనపు ముఖ్య కార్యదర్శి ప్రకటించారు. దేశవ్యాప్తంగా 341 కేసులు నమోదుకాగా.. ఇప్పటివరకు ఏడుగురు మరణించారు.
16:57 March 22
భారత్‌లో 7కు చేరిన కరోనా మృతులు
కరోనా మృతుల సంఖ్య భారత్‌లో ఏడుకు చేరింది. ఇవాళ ఒక్కరోజే ముగ్గురు ప్రాణాలు విడిచారు. బిహార్‌లో తొలి కరోనా మరణం నమోదైంది. ఖతార్ నుంచి వచ్చిన 38 ఏళ్ల వ్యక్తి కొవిడ్ సోకి మరణించినట్లు అధికారులు ధ్రువీకరించారు. సూరత్ ఆసుపత్రిలో మరో వ్యక్తి మృతి చెందాడు. వీరిద్దరికీ కిడ్నీ సంబంధిత సమస్య ఉన్నట్లు సమాచారం. ఇవాళ మహారాష్ట్రలో రెండో కరోనా మరణం సంభవించింది. కరోనా కేసులు 341కి చేరాయి.
- దేశంలో 341కి చేరిన కరోనా కేసుల సంఖ్య
- దేశంలో ఏడుకు చేరిన కరోనా మృతుల సంఖ్య
- మహారాష్ట్రలో కరోనాతో ఇద్దరు మృతి
- దిల్లీ, కర్ణాటక, పంజాబ్, బిహార్, గుజరాత్‌లో ఒక్కొక్కరు మృతి
15:55 March 22
భారత్‌లో మరో కరోనా మరణం..
కరోనా కారణంగా భారత్‌లో మరో మరణం సంభవించింది. కరోనా పాజిటివ్ నమోదైన ఓ 67 ఏళ్ల వ్యక్తి సూరత్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించినట్లు గుజరాత్ ఆరోగ్య శాఖ ధ్రువీకరించింది. అతనికి ఇతర అనారోగ్య సమస్యలూ ఉన్నట్లు తెలుస్తోంది.
14:40 March 22
భారత్‌లో కరోనా కేసులు మరింత పెరిగాయి. మొత్తం 341 మందికి వైరస్ సోకినట్లు నిర్ధరణ అయిందని కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటించింది.
12:26 March 22
దేశంలో 396కు చేరిన కరోనా కేసులు
బిహార్‌లో తొలి కరోనా మరణం నమోదైనట్లు తెలుస్తోంది. రాష్ట్ర రాజధాని పట్నా ఎయిమ్స్‌లో కిడ్నీ సంబంధిత వ్యాధితో 38 ఏళ్ల వ్యక్తి మృతి చెందినట్లు వైద్యులు వెల్లడించారు. ఆ వ్యక్తికి కరోనా పరీక్షలు నిర్వహించగా పాజిటివ్‌గా తేలినట్లు తెలిపారు.
కరోనా కారణంగా ఇప్పటికే ఐదుగురు మృతి చెందినట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ ప్రకటించింది. బిహార్ వ్యక్తి మరణానికి కరోనానే కారణమా? కాదా? అన్నది ఆ శాఖ ధ్రువీకరించాల్సి ఉంది.