ETV Bharat / bharat

బిహార్​ బరి: పక్కా వ్యూహంతో ఎన్డీఏ-లాలూ పార్టీకి సవాళ్లెన్నో.. - బిహార్​ రాజకీయలు

బిహార్‌ అసెంబ్లీ ఎన్నికల తేదీలు ఏ క్షణంలోనైనా వెలువడే అవకాశం ఉంది. ఈ తరుణంలో బిహార్​ రాజకీయాలు ఆసక్తి రేపుతున్నాయి. ప్రధాన పార్టీలన్నీ తమ అనుకూల పార్టీల మద్దతు కూడగట్టుకొని... ప్రత్యర్థులను చిత్తు చేయాలనే వ్యూహాలను అమలు చేయడంలో నిమగ్నమయ్యాయి. తాజా ఎన్నికల్లో రెండు ప్రధాన పార్టీలు బరిలోకి దిగనున్నాయి. వీటిల్లో ఎన్​డీఏ కూటమి ఒకటి. అయితే మరో కూటమిపై స్పష్టత రావాల్సి ఉంది.

Bihar political situation amid near to announce election dates
బిహార్​ ఎన్నికల బరిలో దిగే రెండో కూటమి ఏది?
author img

By

Published : Sep 15, 2020, 8:32 AM IST

దేశంలోని మరో కీలక రాష్ట్రంలో ఎన్నికల సంగ్రామానికి తెర లేస్తోంది. బిహార్‌ అసెంబ్లీ ఎన్నికల తేదీలు ఏ క్షణాన్నయినా వెలువడే అవకాశం ఉంది. దీంతో రాష్ట్రంలో రాజకీయ వేడి రాజుకుంటోంది. ప్రధాన పార్టీలన్నీ తమకు అనుకూల పార్టీలను ఒకతాటిపైకి తీసుకురావడం.. ప్రత్యర్థుల ఎత్తులకు పైఎత్తులు వేయడంలో నిమగ్నమయ్యాయి. తాజా ఎన్నికల్లో ప్రధానంగా రెండు కూటములు కీలకపాత్ర పోషించే అవకాశాలు కనిపిస్తున్నాయి. వీటిలో భాజపాతో కలిసి ముఖ్యమంత్రి, జనతాదళ్‌ యునైటెడ్‌ (జేడీయూ) అధినేత నితీశ్‌ కుమార్‌ కీలకపాత్ర పోషిస్తున్న ఎన్డీయే ఒకటి. దీనికి దీటుగా నిలిచే మరో కూటమి ఏర్పాటుపై మరింత స్పష్టత రావాల్సి ఉంది.

నాడు ఏమైంది?

గత (2015) అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్రీయ జనతాదళ్‌ (ఆర్జేడీ), జేడీయూ, కాంగ్రెస్‌ పార్టీలు మహాఘట్‌ బంధన్‌ (మహా కూటమి)గా ఏర్పడి బరిలోకి దిగాయి. 243 అసెంబ్లీ స్థానాలకు గాను దాదాపు 180 వరకు దక్కించుకున్నాయి. అత్యధికంగా ఆర్జేడీ 80 సీట్లు సాధించింది. అయితే ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించిన నితీశ్‌ కుమార్‌ రెండేళ్ల తర్వాత మహా కూటమి నుంచి బయటకొచ్చి, భాజపా మద్దతుతో తిరిగి అధికారం చేపట్టారు. ఇలా అత్యధిక స్థానాల్లో విజయం సాధించినా ఆర్జేడీ ప్రతిపక్షంలోనే కూర్చోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.

ఆర్జేడీకి సవాళ్లు..
అత్యధిక స్థానాలను సాధించినా ప్రతిపక్షంలోనే ఉన్న ఆర్జేడీ అనేక సవాళ్ల మధ్య బరిలోకి దిగుతోంది. లాలూప్రసాద్‌ యాదవ్‌కు జైలుశిక్ష పడిన నేపథ్యంలో.. తేజస్వీ యాదవ్‌ నేతృత్వంలోని ఆ పార్టీకి ఇప్పుడు బలమైన కూటమిని ఏర్పాటు చేయడం పెద్ద సవాలే. 2019 లోక్‌సభ ఎన్నికల్లోనూ సంకీర్ణ రాజకీయాలతో చేదు అనుభవాలను ఎదుర్కొన్న ఆర్జేడీ ఒకవేళ స్వతంత్రంగా పోటీ చేసినా నెగ్గుకురావడం సవాలే.

ఎన్డీఏకి పోటీ ఎవరు?

ఎన్డీఏలో లేని పార్టీలన్నీ ఆర్జేడీ నాయకత్వంలోని మహా కూటమి కింద పోటీకి సిద్ధమవుతున్నట్లు వాతావరణం కనిపిస్తున్నా.. వాటి ఆశలు, ఆకాంక్షలు ఆర్జేడీకి ఎంతగా దోహదపడతాయన్నది వేచి చూడాలి. కాంగ్రెస్‌, వామపక్ష పార్టీలు ఈ మహా కూటమిలో చేరొచ్చని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. బిహార్‌లో లాలూప్రసాద్‌ యాదవ్‌ హవా మొదలైన తర్వాత ఈ పార్టీల రాజకీయ ప్రాభవం తగ్గుతూ వచ్చింది. ఈ నేపథ్యంలో ఆ పార్టీలు లాలూ పార్టీతోనే కలిసి ఉంటున్నాయి. కాంగ్రెస్‌తో పాటు, ఉపేంద్ర కుశ్వాహాకి చెందిన రాష్ట్రీయ లోక్‌ సమతా పార్టీ (ఆర్‌ఎల్‌ఎస్‌పీ), సీపీఐ, సీపీఎం, సీపీఐ(ఎం-ఎల్‌)లు వేటికవే తమకు మంచి పట్టు ఉన్నట్లు చెబుతున్నాయి. కానీ ఆర్జేడీ ఓటుబ్యాంకుపైనే ఆధారపడటం వల్ల ఆ పార్టీతోనే ఉండక తప్పని పరిస్థితుల్లో ఉన్నాయి.

కాంగ్రెస్‌తో పాటు.. ప్రస్తుత అసెంబ్లీలో ఒక్క స్థానం కూడా లేని సీపీఐ, సీపీఎంలు; 3 స్థానాలున్న సీపీఐ(ఎం-ఎల్‌); చిన్న పార్టీలైన వికాస్‌షీల్‌ ఇన్సాన్‌, ఆర్‌ఎల్‌ఎస్పీలు కూడా ఈసారి ఎక్కువ స్థానాలను తమకు కేటాయించాలని పట్టుబడుతున్నట్లు తెలుస్తోంది. ఎన్డీఏను అధికారంలోకి రాకుండా చేయడమే ఆర్జేడీ లక్ష్యమని చెబుతున్న నేపథ్యంలో ఈ పార్టీలన్నీ తమకు కనీసం 100 స్థానాలు కేటాయించాలని.. ఆర్జేడీకి 140 స్థానాలను వదిలేయాలన్న ఉద్దేశంతో ఉన్నట్లు రాజకీయ వర్గాల్లో ప్రచారం సాగుతోంది. 2015 ఎన్నికల్లో 101 స్థానాల్లో పోటీచేసి 80 గెలుచుకున్న ఆర్జేడీ ఆ కోరికలను నెరవేరస్తుందా? ఏ బాటను తీసుకుంటుందో? వేచి చూడాలి. ఏ పార్టీ అయినా సొంతంగా అధికారంలోకి రావాలంటే 122 స్థానాలు సాధించాల్సి ఉంటుంది. గత అనుభవాల దృష్ట్యా ఆర్జేడీ ఈ మార్కును చేరాలంటే ఎక్కువ స్థానాల్లోనే బరిలోకి దిగాల్సి ఉంటుందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.

Bihar political situation amid near to announce election dates
2015లో ఎవరి బలమెంత!

ఎన్డీయే వ్యూహమేంటి?

మహాకూటమి ఏర్పాటై ఆర్జేడీ 140 స్థానాల్లోనే పోటీకి పరిమితమైతే అప్పుడు ఎన్డీఏ పని సులువైపోతుంది. ఆర్జేడీ సొంతంగా మెజార్టీలోకి రాకుండా చేయాలన్న ప్రధాన లక్ష్యాన్ని సాధించగలుగుతుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. నితీశ్‌కే ప్రాధాన్యం ఇస్తూ ఎన్డీయే పావులు కదుపుతోంది. నితీశ్‌ నాయకత్వంలో బిహార్‌ ప్రగతి పథంలో దూసుకుపోతోందని చెప్పడం ద్వారా ఆయనే ముఖ్యమంత్రి అభ్యర్థి అని ప్రధాని మోదీ పరోక్షంగా స్పష్టం చేశారు. మోదీ, నితీశ్‌ల సారథ్యంలో.. తిరిగి తమ కూటమే అధికారంలోకి వస్తుందని భాజపా నేత, ఉప ముఖ్యమంత్రి సుశీల్‌కుమార్‌ మోదీ అంటున్నారు. అయితే సీట్ల పంపకంపై ఎన్డీఏలోనూ పేచీ తలెత్తే అవకాశం ఉంది. ముఖ్యంగా ఎల్‌జేపీ, ఇటీవలే ఈ కూటమిలో చేరిన హెచ్‌ఏఎం ఎక్కువ సీట్లకు పట్టుబట్టే అవకాశం ఉంది.

యశ్వంత్‌ సిన్హా ప్రభావం ఎంత?

ఒకప్పుడు భాజపాలో ముఖ్యమైన నేతగా ఉన్న యశ్వంత్‌ సిన్హా తాజా బిహార్‌ ఎన్నికల బరిలోకి దిగుతున్నారు. 16 చిన్నాచితకా పార్టీలతో కలిపి ఐక్య ప్రజాస్వామ్య కూటమిని ఏర్పాటు చేశారు. మొత్తం 243 స్థానాల్లోనూ పోటీ చేయనున్నట్లు ప్రకటించారు. ఈ కూటమి ఎంతోకొంత భాజపా ఓట్లపై ప్రభావం చూపుతుందన్న అంచనాలున్నాయి.

ఇదీ చూడండి: చెన్నైకి వరద ముప్పు తప్పేలా మద్రాసు ఐఐటీ ప్రణాళిక

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.