ETV Bharat / bharat

కరోనాతో బిహార్​ మంత్రి కన్నుమూత

author img

By

Published : Oct 16, 2020, 11:13 AM IST

Updated : Oct 16, 2020, 11:45 AM IST

కరోనా బారిన పడి బిహార్​ మంత్రి కపిల్​ దేవ్​ కన్నుమూశారు. కొన్నిరోజులుగా పట్నాలోని ఎయిమ్స్​లో కొవిడ్​ చికిత్స పొందుతున్న ఆయన.. శుక్రవారం తీవ్ర అస్వస్థతకు గురై తుదిశ్వాస విడిచారు.

Bihar Minister Kapil Deo Kamat dies due to COVID-19
కరోనా మహమ్మారి విలయం.. మంత్రి మృతి

అసెంబ్లీ ఎన్నికల వేళ.. కరోనా మహమ్మారి బిహార్​ రాజకీయాల్లో తీరని లోటును మిగిల్చింది. జేడీయూ సీనియర్​ నేత, పంచాయతీ రాజ్​ శాఖ మంత్రి కపిల్​ దేవ్​ కామత్​ కరోనాతో శుక్రవారం కన్నుమూశారు.

కొవిడ్​ సోకగా.. కొన్నిరోజుల నుంచి పట్నాలోని ఎయిమ్స్​లో ఆయన చికిత్స పొందుతున్నారు. కపిల్​ మృతి పట్ల బిహార్​ ముఖ్యమంత్రి నితీశ్​ కుమార్​ తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. కపిల్​ను 'నిరాడంబరమైన నేత'గా కొనియాడారు.

" కపిల్​ పాలనాదక్షుడు, ప్రసిద్ధ నేత. ఆయన మృతి నన్ను తీవ్ర విచారానికి గురి చేసింది. రాజకీయాల్లో, సామాజికంగానూ ఆయన లోటు తీరనిది"

-- నితీశ్​ కుమార్​, బిహార్​ ముఖ్యమంత్రి

ప్రభుత్వ లాంఛనాలతో కపిల్​ దేవ్ అంత్యక్రియలు నిర్వహిస్తామని నితీశ్​ కుమార్​ తెలిపారు.​

ఇదీ చూడండి:బిహార్‌ ఎన్నికల్లో జోస్యాలపైనా ఈసీ నిషేధం

Last Updated : Oct 16, 2020, 11:45 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.